Site icon NTV Telugu

Vijaya Sai Reddy: ముసలాడికి గాలి సోకిందో ఏమో..? చంద్రబాబుపై సాయిరెడ్డి కౌంటర్

Vijaya Sai Reddy

Vijaya Sai Reddy

ఏపీ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. బాదుడే బాదుడు పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ పెరిగిన ధరలు, ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే, సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. చంద్రబాబుపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు.. అర్జంటుగా సైకియాట్రిస్టుకో, బూతవైద్యుడికో చూపించండయ్యా.. ముసలాడికి (చంద్రబాబు) మెంటలో, గాలి సోకిందో, మతిపోయిందో తెలియట్లేదు అంటూ సెటైర్లు వేశారు. కోట్లాది మంది ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి, ప్రధానిని పట్టుకుని ఎవరువీళ్ళు ఉత్తరాంధ్రకు అంటున్నాడు.. గొలుసులు సిద్ధం చేసుకోండి తెలుగు తమ్ముళ్లూ… అంటూ కామెంట్‌ చేశారు సాయిరెడ్డి..

మరోవైపు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కౌంటర్‌ ఇచ్చారు.. సోషల్‌ మీడియా వేదికగా సాయిరెడ్డిపై మండిపడ్డ ఆమె.. పండుకోతికి పిచ్చి ముదిరింది. మా నాయకుడు అడిగింది ఉత్తరాంధ్రలో ఏ2కు పనేంటని..? భూ కబ్జాలకా..? గంజాయి వ్యాపారానికా..? అక్రమ వసూళ్లకా..? అని A2 గురించి ప్రశ్నించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముసలి కోతికి అల్జీమర్స్ ఎక్కువై A2 అంటే ఎవరో గుర్తుకు రావడం లేదనుకుంటా..? చంచల్ గూడా చిప్పకూడు అంటే అన్నీ గుర్తొస్తాయి.. అంటూ సెటైర్లు వేశారు వంగలపూడి అనిత.

Exit mobile version