NTV Telugu Site icon

Nandigam Suresh: జగన్‌కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఎవ్వరికీ సాధ్యం కాదు

Nandigam Suresh On Sridevi

Nandigam Suresh On Sridevi

MP Nandigam Suresh Fires On Undavalli Sridevi Comments: ముఖ్యమంత్రి జగన్‌కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఎవ్వరికీ సాధ్యం కాదని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తేల్చి చెప్పారు. సస్పెండ్ అయిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని హెచ్చరించారు. స్కాములు, స్కీములు, టిడ్కో ఇళ్లు అంటూ శ్రీదేవి ఏదేదో మాట్లాడతున్నారని.. ఉండవల్లి శ్రీదేవి వెనుకా, ముందూ చూసుకుని మాట్లాడాలని సూచించారు. విమర్శలు చేసే ముందు శ్రీదేవి అన్ని ఆలోచించుకోవాలని, తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు. తమ నుంచి ఉండవల్లి శ్రీదేవికి ఎలాంటి ఆపద ఉండదన్న ఆయన.. పార్టీ స్టాండ్ దాటారు కాబట్టే ఆమెపై వేటు పడిందని స్పష్టం చేశారు.

K Raghavendra Rao: దర్శకేంద్రుడికి అరుదైన గౌరవం.. లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్

దళితులను సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపణలు చేసిన నందిగం సురేష్.. ఏనాడన్నా చంద్రబాబు దళితులను గౌరవించారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే శ్రీదేవి మాట్లాడారని పేర్కొన్నారు. గతంలో శ్రీదేవిని మేకప్, పేకప్ అంటూ టీడీపీ నేతలు విమర్శించిన విషయం గుర్తించాలని సూచించారు. టీడీపీకి ఓటేసి.. అమరావతి, రాజధాని అంటూ ఉండవల్లి శ్రీదేవి ఏవేవో మాటలు మాట్లాడుతున్నారన్నారు. శ్రీదేవికి ఏపీలో పూర్తి రక్షణ ఉందని.. ఆమెకు టీడీపీ నుంచే ప్రమాదం పొంచి ఉందని అన్నారు. టీడీపీ దాడి చేసి.. దాన్ని వైసీపీ వాళ్లే చేశారని చెప్తారన్నారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని, తప్పు చేసిన వారిని జగన్ ఉపేక్షించరని తేల్చి చెప్పారు. చంద్రబాబు తరహాలో తప్పులు చేసిన వాళ్లను జగన్ వెంటపెట్టుకుని తిరగరని, ఇలుక బకాసురులను జగన్ ప్రొత్సహించరని చెప్పుకొచ్చారు.

Spa Center: స్పా ముసుగులో వ్యభిచార దందా.. గుట్టురట్టు చేసిన పోలీసులు

కాగా.. సస్పెండ్ అయిన మూడు రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చిన ఉండవల్లి శ్రీదేవి.. గత మూడు రోజులుగా వైసీపీ గుండాలు తనని వేధిస్తున్నారని, డాక్టర్ సుధాకర్ తరహాలోనే తనని కూడా చంపుతారన్న భయంతో తాను అజ్ఞాతంలో ఉన్నానని ఆరోపణలు చేశారు. వైసీపీలో ఇతర అసంతృప్తి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని, వాళ్ల మీద ఎందుకు అనుమానం పడట్లేదని నిలదీశారు. అమరావతి రైతుల కోసం తాను ప్రాణం పోయేదాకా పోరాటం చేస్తానని ఉద్ఘాటించారు. తనని పిచ్చి కుక్కతో సమానంగా చూశారన్న ఆమె.. తనకు ప్రాణహాని ఉందని, తనకేం జరిగినా దానికి సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యత వహిస్తాడని చెప్పారు. తాను దళిత ఎమ్మెల్యే అయినందుకే పార్టీలో గుర్తింపు లేదన్నారు.