MP Nandigam Suresh Challenges Pawan Chandrababu Lokesh: చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లకు ఎంపీ నందిగం సురేష్ సవాల్ విసిరారు. ఎస్సీలకు జగన్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, చంద్రబాబు హయాంలో జరిగిన నష్టంపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని.. ఆ ముగ్గురిలో ఎవరొచ్చినా తనకు ఓకే అని ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే తనతో చర్చకు రావాలన్నారు. తాడేపల్లిలో నందిగం సురేష్ మాట్లాడుతూ.. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే, చంద్రబాబు కోర్టులకు వెళ్ళి ఆపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎస్సీలు చదువుకోరని, ఎస్సీలు శుభ్రంగా ఉండరని చెప్పిన టీడీపీ నేతలు.. ఇప్పుడు ఎస్సీలకు అన్యాయం జరుగుతోందని మాట్లాడటం, దెయ్యాలు వేదాలు వెల్లడించినట్లు ఉందని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఆర్డిఏ ప్రాంతంలో చంద్రబాబు దళితులకు చేసిన అన్యాయం తాను నిరూపిస్తానని నందిగం సురేష్ పేర్కొన్నారు. పుల్లారావు మంత్రిగా ఉన్నప్పుడు.. ఎస్సీలను చీమలు, దోమలు, కప్పలతో పోల్చి అవమానించాడని దుయ్యబట్టారు. చంద్రబాబు ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ అని ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలను అచ్చెన్నాయుడు ఎప్పుడైనా ఖండించాడా? అని ప్రశ్నించారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అన్న వ్యాఖ్యలకు చంద్రబాబు ఇంకా కట్టుబడి ఉన్నాడని.. అందుకే ఇప్పటివరకు క్షమాపణలు చెప్పలేదని వ్యాఖ్యానించారు.
SS Rajamouli: హీరోలను తలదన్నే లుక్లో జక్కన్న.. ఫస్ట్ యాడ్ కు అన్ని కోట్లు ఛార్జ్ చేశాడా?
అంతకుముందు కూడా.. మాదిగలకు చంద్రబాబు ఏం చేశాడని నందిగం సురేష్ ప్రశ్నించారు. 2014 మేనిఫెస్టోలో మాదిగ కార్పొరేషన్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి.. గెలిచిన తర్వాత దాని ఊసే ఎత్తలేదన్నారు. గతంలో మాదిగలు సభలు పెట్టుకుంటే.. చంద్రబాబు వాటిని అడ్డుకుని, కేసులు పెట్టించారని ఆరోపించారు. 2014లో మాదిగ కులానికి ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదని.. కానీ వైసీపీ ప్రభుత్వంలో మాత్రం 8 మంది ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎస్సీలందరూ వైసీపీతోనే ఉన్నారని చెప్పిన ఆయన.. మాదిగ సభల్లో టీడీపీ నేతలు అబద్ధాలు మాట్లాడారని, అందుకు వారికి సిగ్గుండాలని విమర్శించారు. చంద్రబాబుకు ఎస్సీలంటే ఏమాత్రం ఇష్టం లేదన్నారు. చంద్రబాబు అన్నీ కులాల వారినీ మోసం చేశారని ఆరోపణలు గుప్పించారు. వచ్చే 20 ఏళ్ల వరకు ఈ రాష్ట్రానికి వైఎస్ జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని నందిగం సురేష్ ఉద్ఘాటించారు.
Merugu Nagarjuna: చంద్రబాబు దళిత ద్రోహి.. దళితులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా?