SS Rajamouli: హీరోలను తలదన్నే లుక్లో జక్కన్న.. ఫస్ట్ యాడ్ కు అన్ని కోట్లు ఛార్జ్ చేశాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajamouli Stylish looks in oppo ad film: మన హీరోలు ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే ఆ క్రేజ్‌తో భారీ కమర్షియల్ యాడ్స్‌లో కనిపిస్తూ నాలుగు రాళ్ళు వెనకేసుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా మన తెలుగు హీరోలు అయితే మూడు నుంచి నాలుగు బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ గట్టిగానే సంపాదిస్తున్నారు. ఒక్కో యాడ్‌కు తమకున్న క్రేజ్‌ని బట్టి భారీ స్థాయిలో డబ్బు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ కూడా పలు బ్రాండ్‌లకు ప్రచార కర్తలుగా వ్యవహరిస్తూ గట్టిగానే వెనకేసుకుంటున్నారు. తాజాగా ఈ లిస్టులోకి పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి అడుగుపెట్టారు. పాపులర్ మొబైల్ బ్రాండ్ ఒప్పోకు రాజమౌళి ప్రచార కర్తగా మారి ఈ మధ్యనే యాడ్ షూట్లో కుడా పాల్గొన్నారు. సదరు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న జక్కన్న ఇటీవల యాడ్ షూట్ లో పాల్గొనగా అప్పటి వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజమౌళి నటించిన తొలి కమర్షియల్ యాడ్ ఇదే కావడంతో పాటు మునుపెన్నడూ లేని విధంగా క్రీమ్ కలర్ బ్లేజర్ ధరించి, రౌండ్ నెక్ టీషర్ట్..మ్యాచింగ్ ప్యాంట్‌తో స్టైల్‌గా కనిపిస్తున్న తీరు ఫ్యాన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంది..
Hyderabad ORR: ఔటర్ రింగురోడ్డు మీద స్పీడ్ లిమిట్ పెంపు
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో రాజమౌళి స్లైలిష్‌గా కనిపిస్తూ ఆకట్టుకోగా ఇప్పుడు ఒప్పో సంస్థకూ చెందిన ఒక అధికారి రాజమౌళి వీడియోని షేర్ చేశారు. ఇక ఈ ఒప్పో యాడ్ కోసం రాజమౌళి ఏకంగా రూ. 3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని అంటున్నారు. అయితే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాలి అంటే దానికి అదనంగా ఫీజులు సమర్పించాల్సిందే అని అంటున్నారు. ఇక ఈమధ్యనే ఆర్ఆర్ఆర్ సినిమాతో హిట్ అందుకున్న జక్కన్న త్వరలో సూపర్ స్టార్ మహేష్‌తో భారీ బడ్జెట్ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేయనున్న ఈమూవీని ఆగస్టు 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా లాంఛనంగా ప్రారంభించనున్నారని వార్తలు వినిపిస్తున్నా అందుకు క్లారిటీ రావాల్సి ఉంది.
One Rajamouli is epic enough. But two???
Something spectacular is on its way. #StayTuned@ssrajamouli#OPPOReno10Series#MakeEverySceneSpectacular #OPPO pic.twitter.com/Va0eQ2C9OZ
— Damyant Singh Khanoria (@damyantsingh) June 27, 2023
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!