Site icon NTV Telugu

MP Kesineni Nani Vs Kesineni Chinni: రాజకీయాలతో సంబంధం లేదు.. నా పేరు దుర్వినియోగం చేశారు..!

Mp Kesineni Nani

Mp Kesineni Nani

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్‌ చిన్ని మధ్య వివాదాలు తారా స్థాయికి చేరాయి. చివరకు సొంత తమ్ముడు కేశినేని శివనాథ్‌పై పోలీసుకు ఫిర్యాదు చేశారు ఎంపీ కేశినేని నాని. తన ఎంపీ స్టిక్కర్‌ను వాడుతూ.. దుర్వినియోగం చేస్తున్నారని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అయితే, ఈ వివాదం రచ్చగా మారడం.. అన్న వ్యవహారాన్ని తమ్ముడు చిన్ని తప్పుబట్టడంపై ఎంపీ కేశినేని నాని స్పందిస్తూ.. తన పేరుతో ఎంపీ కారు స్టిక్కర్ ను నకిలీది సృష్టించారని తెలిపారు.. ఎంతో కాలంగా నా పేరుతో నకిలీ కారు స్టిక్కర్ ను ఉపయోగిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వ్యక్తి ఎంపీ స్టిక్కర్ పేరుతో బెదిరింపులు, మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.. పార్లమెంట్ లో ఒక ఎంపీకి ఒక్క స్టిక్కర్ మాత్రమే ఇస్తారు.. ఈ నకిలీ స్టిక్కర్ వ్యవహారం పై ఆధారాలతో సహా పార్లమెంట్ సెక్రటరీ జనరల్ కు ఫిర్యాదు చేశానని వెల్లడించారు.. లోక్ సభ అధికారుల సూచనతో తెలుగు రాష్ట్రాల డీజీపీలకు ఫిర్యాదు చేశాను.. ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు కేశినేని నాని.

Read Also: Kesineni Nani vs Kesineni Chinni: రచ్చకెక్కిన కేశినేని ఫ్యామిలీ..! సోదరుడిపై ఫిర్యాదు

ఇక, ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్‌ చిన్ని మధ్య వివాదాలు తారా స్థాయికి చేరి పీఎస్‌ వరకు వెళ్టాయి.. ఈ వ్యవహారంలో పటమట పోలీసులకు మే నెల 27న ఫిర్యాదు అందగా.. జూన్ 9వ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. కేశినేని చిన్నిపై ఐపీసీ 420, 416, 415, 468, 499 రెడ్ విత్ 34 కింద కేసులు నమోదు చేశారు. అయితే, ఈ వ్యహారంపై కేశినేని చిన్ని స్పందిస్తూ.. ఓ చిల్లర వివాదంలోకి ఎంపీ కేశినేని నాని నా కుటుంబాన్ని లాగడం బాధాకరం అన్నారు.. ఆ స్టిక్కర్ ఎవరిదో ఏంటో విచారణలో తేలనివ్వండి అన్నారు.. హైదరాబాద్‌లో పోలీసులు ఆపారు.. పోలీస్ కమిషనర్ ఆఫీసుకు తీసుకెళ్లారు.. ఎంక్వైరీ చేశారు.. మళ్లీ కారును పంపించారని తెలిపారు.. నేను ఓ చిన్న కార్యకర్తను.. చంద్రబాబు సీఎం కావడమే మా లక్ష్యంగా పేర్కొన్న ఆయనే.. ఆటోనగర్‌లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవం జరపాలని భావించాను.. కానీ, దానిని కూడా వివాదాల్లోకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: MP Kesineni Nani Vs Kesineni Chinni : ఇది చిల్లర వివాదం.. నాని నా శత్రువు కాదు.. సొంత అన్న..

Exit mobile version