GVL Narasimha Rao: విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణకు జాతీయ ప్రాధాన్యత ఇవ్వాలి.. కేంద్ర మంత్రికి జీవీఎల్ విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GVL Narasimha Rao: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పూర్తిస్థాయి పనితీరు కోసం వర్కింగ్ క్యాపిటల్ సమస్యను తీర్చాలని కోరుతూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు భేటీ అయ్యారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ (ఆర్‌ఐఎన్‌ఎల్) ఎదుర్కొంటున్న తీవ్రమైన వర్కింగ్ క్యాపిటల్ సమస్యను అంతం చేయడానికి మంత్రిత్వ శాఖ జోక్యాన్ని కోరారు.
గత ఏడాది రూ.913 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన ఆర్‌ఐఎన్‌ఎల్.. ప్రస్తుత సంవత్సరంలో వర్కింగ్ మెటీరియల్ అందుబాటులో లేకపోవడం, అధిక ముడిసరుకు ధర, ప్రతికూల మార్కెట్ పరిస్థితుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఎంపీ జీవీఎల్, మంత్రికి సమర్పించిన లేఖలో పేర్కొన్నారు. ఆర్ఐఎన్‌ఎల్‌లో ఖాళీగా ఉన్న డైరెక్టర్ ఫైనాన్స్ వంటి నిర్వహణ స్థాయి స్థానాలను భర్తీ చేయాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తన లేఖలో హైలైట్ చేశారు.
Also Read
- AP Ward Delimitation: మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన.. షెడ్యూల్ విడుదల
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్స్‌దే.. కఠిన చర్యలకు పవన్ కల్యాణ్ ఆదేశాలు
- Perni Nani: టెట్ క్వాలిఫై కానివారు మెరిట్ లిస్టులోకి ఎలా..? స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు ఆన్లైన్లో పెట్టే దమ్ముందా?
Venkaiah Naidu: అప్పుడు చాలా బాధపడ్డా.. వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు..
బలమైన, శక్తివంతమైన, లాభదాయకమైన ఆర్‌ఐఎన్‌ఎల్ విశాఖపట్నం ప్రాంతం, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల స్థంభం వంటిదని పేర్కొన్న జీవీఎల్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వహణకు జాతీయ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో తాను భేటీ కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. వర్కింగ్ క్యాపిటల్ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ముడిసరుకును మంత్రిత్వ శాఖ ముందస్తుగా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తుందని తెలియచేశారని చెప్పారు. ఆర్‌ఐఎన్‌ఎల్ తన సామర్థ్య వినియోగాన్ని పెంచుకునేందుకు ఈ వెసులు బాటు సహాయ పడుతుందని మంత్రి అభిప్రాయ పడ్డారు
తాజావార్తలు
-
AP Ward Delimitation: మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన.. షెడ్యూల్ విడుదల
-
Swatantra Bhardwaj: కాక్రోచ్ పార్టీ మద్దతుదారుడిపై దాడి.. స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్..
-
Modi-Meloni: ఇటలీ ప్రధానిగా మెలోని రికార్డ్.. మోడీ అభినందనలు.. రిప్లై ఇదే!
-
Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
-
US Ambassador: ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!