Site icon NTV Telugu

Extramarital Affair: ఛీ ఛీ.. నువ్వు తల్లివేనా.. వివాహేతర సంబంధం కోసం కన్న కొడుకునే..

Mother Killed Son

Mother Killed Son

Mother Killed Her Son For Extramarital Affair In Kurnool: తల్లిని దేవుడి ప్రతిరూపంగా చెప్పుకుంటుంటారు. ఎందుకంటే.. తొమ్మిది నెలలు మోసి, ఆపై తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆలనాపాలనా చూసుకుంటుంది తల్లి. తాను పస్తులుండి, పిల్లల కడుపు నింపుతుంది. అసలు తల్లి ప్రేమని మాటల్లో వర్ణించలేం. కానీ.. ఓ తల్లి మాత్రం అందుకు భిన్నంగా పైశాచికంగా ప్రదర్శించింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. తన ప్రియుడితో కలిసి చిత్రహింసలకు గురి చేసింది. అతడు చచ్చేదాకా వేధింపులకు గురి చేసింది. అవును.. సభ్యసమాజం తలదించుకునే ఈ సంఘటన నందలూరులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Off The Record: ఆ జిల్లాలో పొలిటికల్‌ వారసుల హడావిడి.. నాన్నకు ప్రేమతో..!

నందలూరు మండలంలోని అరవపల్లెకు చెందిన జహీరున్నీషాకు కొన్ని సంవత్సరాలక్రితం అబ్దుల్లాతో వివాహం అయ్యింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లల్ని మదరసాలో చేర్పించగా.. మూడో పిల్లాడు షాహిద్ ఇంట్లోనే ఉన్నాడు. అయితే.. షాహిద్ మూగవాడు. కొంతకాలం క్రితం విభేదాల కారణంగా.. జహీరున్నిషా, అబ్దుల్లా విడిపోయాడు. దీంతో.. షాహిద్‌ని కూడా తన వద్దే ఉంచుకుంది. బాబుతో ఒంటరిగా ఉంటున్న జహీరున్నీషాకు కొన్నాళ్ల క్రితం స్వీపర్‌గా పని చేస్తున్న లక్ష్మీనారాయణ పరిచయం అయ్యాడు. అది వారిద్దరిని దగ్గర చేయడంతో.. ఇద్దరు కలిసి సహజీవనం చేయడం మొదలుపెట్టారు. అయితే.. నారాయణతో కలిసి ఉంటున్నప్పటి నుంచి జహీరున్నీషా షాహిద్‌ని కొట్టడం మొదలుపెట్టింది.

Anurag Thakur: భారతీయ సంస్కృతి, సమాజాన్ని కించపరిచే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను అనుమతించబోం

తన సహజీవనానికి అడ్డుగా ఉంటున్నాడని షాహిద్‌ని చిత్రహింసలకు గురి చేసేది. గత నెల 28న ఆమె తీవ్రంగా కొట్టడంతో.. పాపం అతడు మంచాన పడ్డాడు. మూగవాడు కూడా కావడంతో, తన బాధ ఎవరితో చెప్పుకోలేక షాహిద్ లోలోపలే కుమిలిపోయాడు. స్థానికులు పిల్లాడి పరిస్థితి చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు కౌన్సిలింగ్ ఇచ్చి, బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలని హితబోధ చేసి పంపించారు. అయినా జహీరున్నీషాలో మార్పు రాలేదు. నాలుగు రోజుల క్రితం తలుపులు మూసేసి.. తన ప్రియుడితో కలిసి ఆమె షాహిద్‌ని చితకబాదింది. పాపం ఆ కుర్రాడు.. వాళ్లు కొట్టిన దెబ్బల్ని భరించలేక బోరున విలపించాడు. ఎంత ఘోరంగా కొట్టారంటే.. వారి దెబ్బలకు అతడు తీవ్ర జ్వరం బారిన పడ్డాడు.

Girlfriend Killed: యూపీలో దారుణం.. ప్రియురాలి గొంతుకోసి హత్య చేసిన ప్రియుడు

పిల్లాడు చనిపోతే తమకు సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో.. ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పడంతో.. వాళ్లు కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలుడ్ని పరిశీలించిన వైద్యులు.. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ.. మెట్లపై నుంచి పడి షాహిద్ గాయాలపాలయ్యాడని జహీరున్నీషా మాయమాటలు చెప్పేందుకు ప్రయత్నించింది. చివరికి ఆ పిల్లాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version