గన్నవరం పాలిటిక్స్ హీట్ పెంచాయి.. నియోజకవర్గంలో ఉన్న విభేదాలు చివరకు అధిష్టానం వరకు చేరాయి.. అయితే, ఇప్పుడు గన్నవరం టికెట్‌పై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తేల్చేసింది.. సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకే వచ్చే ఎన్నికల్లో ఆ సీటు కేటాయిస్తారని తెలుస్తోంది.. టీడీపీలో పరమ విధేయుడిగా ఉన్న వంశీ.. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూడడం.. ఆ సమయంలో తాను మాత్రం గన్నవరం నుంచి మరోసారి విజయం సాధించడంతో టీడీపీకి బైబై చెప్పేశారు.. సందర్భం దొరికితే చంద్రబాబు, లోకేష్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతూ వచ్చారు.. అయితే, గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన దుట్టా రామచంద్రరావు నుంచి, వల్లభనేని మీద 2014 ఎన్నికల్లో పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావు ఇలా వర్గాలు వంశీకి తలనొప్పులు తెచ్చిపెట్టాయి.
Read Also: Astrology: మే 24, మంగళవారం దినఫలాలు
ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ నాకే అంటే.. లేదు పోటీ చేసేది నేనేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు నేతలు.. వైసీపీ సీనియర్ నేతలో టికెట్‌పై ఆశలు పెట్టుకోగా.. ఇంకో వైపు వైసీపీలోకి జంప్ చేసి వచ్చిన వంశీ అక్కడ ఉన్న వారితో సర్దుకుపోకుండా నేనంటే నేనే అన్న టైప్ లో పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడుతున్నారు.. ఇక, గన్నవరం టికెట్ నాదే, 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసేది కూడా నేనేనంటూ ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. దీంతో, నేతల మధ్య గ్యాప్ క్రమంగా పెరుగుతూ పోయింది.. ఈ పంచాయతీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ వరకు వెళ్లింది.. అందులో భాగంగా.. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంవో అధికారులతో సమావేశం అయ్యారు వల్లభనేని వంశీ.. ఆ భేటీలోనే టికెట్‌పై క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
సోమవారం రోజు సజ్జల, సీఎంవో అధికారులతో సమావేశం అయ్యారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. ఈ భేటీలో దుట్టా రామచంద్రరావు వర్గంతో విబేధాలపై వల్లభనేనిని వివరణ కోరారు సజ్జల.. అయితే, తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని వంశీ వివరణ ఇచ్చుకున్నట్టుగా సమాచారం. అయితే, ఈ సమావేశంలోనే వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఎవరికి? అనేదానిపై క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.. గన్నవరం టిక్కెట్ వంశీకే…! సీఎం వైఎస్ జగన్ మనసులో ఇదే ఉంది.. ఆయన మాటగా చెబుతున్నా.. వంశీ టికెట్ నీకే అంటూ సీఎం మాటగా సజ్జల చెప్పినట్లు సమాచారం.. అయితే, పార్టీలో అందరినీ కలుపుకుని వెళ్లాలంటూ వల్లభనేని వంశీకి హితబోధ చేశారట సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే వైసీపీ వర్సెస్ టీడీపీగానే కాకుండా.. వైసీపీలోని గ్రూప్ రాజకీయాలతో గరంగరంగా మారిన గన్నవరం పాలిటిక్స్ ఇప్పుడైనా కుదుటపడతాయా? అనేది వేచిచూడాల్సిన విషయం.