ఏపీ డీజీపీని కలిశారు వల్లభనేని వంశీ. సంకల్ప సిద్ధి కేసుతో తనకు సంబంధం లేదన్నారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. సంకల్ప సిద్ధి చీటింగ్ కేసుతో కొడాలి నానికి, తనకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. టీడీపీలో ఉంటే మంచోళ్లు.. లేకుంటే కాదా? అని ప్రశ్నించారు. తనపై అసత్య ఆరోపణలు చేశారని, పట్టాభి, బచ్చుల అర్జునుడిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు వల్లభనేని వంశీ. సంకల్ప సిద్ధి కేసులో ఆధారాలు లేకుండా నాపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు.. సంకల్ప సిద్ధి వాళ్లు ఎవ్వరూ నాకు తెలియదన్న ఆయన.. కరోనాతో నేను హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటే నాపై అసత్య ఆరోపణలు చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Soyam Bapu Rao: చిరుతపులుల్లా టీఆర్ఎస్ నాయకులను వేటాడాలి
పట్టాభి, బచ్చుల అర్జునుడుపై డీజీపీకి ఫిర్యాదు చేశానన్నారు వల్లభనేని.. ఈ కేసులో నాపై ఏ ఆధారం ఉన్నా కూడా నేను సిద్దంగా ఉన్నాను.. కానీ, అసత్య ఆరోపణలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యేనని ఫైర్ అయ్యారు.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి నాపై ఆరోపణలు చేశారని.. ప్రజల్లో మా ఇమేజ్ డ్యామేజ్ కలిగే అంశం అన్నారు.. టీడీపీ నేతలకు దమ్ము ఉంటే ఆధారాలు చూపించాలని సవాల్ చేశారు.. ఇక, నేను హై కోర్టును ఆశ్రయిస్తాను.. సంక్రాంతి పండుగ చేస్తున్నప్పుడు కూడా నేను క్యాసినో పెట్టా అని ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.. క్యాసినో కేసులో ఈడీ ఎంక్వైరి చేస్తే.. నా పేరు, నాని పేరు ఎక్కడైనా వచ్చిందా? అని నిలదీశారు.. సంకల్ప సిద్ధి అనే పేరు నేను ఎప్పుడు వినలేదు, వాళ్లని ఎప్పుడూ చూడలేదన్న ఆయన.. నేను ఉన్నా, నా అనుచరులు ఉన్నా విచారణకు సిద్ధం అన్నారు.. ఈ విషయాన్ని ఇంతటితో వదలను అంటూ టీడీపీ నేతలను హెచ్చరించారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్.