NTV Telugu Site icon

MLA Prasanna Kumar: పవన్ ఎన్ని సభలు పెట్టి వైసీపీని తిట్టినా.. మళ్లీ మేమే గెలుస్తాం

Prasanna Kumar On Pk

Prasanna Kumar On Pk

MLA Nallapureddy Prasanna Kumar Comments On Pawan Kalyan Varahi Yatra: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అయిన పవన్ కళ్యాణ్.. ఎన్ని వారాహి యాత్రలు చేసినా, ఎన్ని సభలు పెట్టి వైసీపీని తిట్టినా.. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. ఏదో ఒక విధంగా సీఎం జగన్‌మోణ్ రెడ్డికి ఇంటికి పంపించాలని కొన్ని విష సర్పాలు బయలుదేరాయని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కుర్చీ కోసం మరోసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్కటయ్యారని వ్యాఖ్యానించారు. పవన్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని.. ఇప్పటికే ఆయన ఐదు పెళ్లిళ్లు చేసుకున్నాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Thalapathy Vijay: అదే చివరి సినిమా.. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం?

చంద్రబాబు దగ్గర సూట్‌కేసులు తీసుకుంటున్న పవన్ కళ్యాణ్.. ఏరోజూ తాను ముఖ్యమంత్రి అవుతానని చెప్పలేదని ప్రసన్న కుమార్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే అయితే చాలు, శాసనసభలో అడుగుపెట్టాలని పవన్ అనుకుంటున్నాడే తప్ప.. ముఖ్యమంత్రి కావాలని ఆయన లేదన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలన్నదే ఆయన ప్రయత్నమని అభిప్రాయపడ్డారు. ప్రజలు అమాయకులేం కాదని.. రాజకీయ నాయకులు కన్నా చాలా తెలివైన వారని.. చంద్రబాబు, పవన్ కుమ్మక్కై చేస్తున్న రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. పవన్ ఎన్ని మాటలు మాట్లాడినా.. ఎంత విషపు ప్రచారం చేసినా.. సీఎం జగన్ వెంట్రుక కూడా పీకలేరంటూ తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ జగన్‌నే శాశ్వత ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారని వెల్లడించారు.

Adipurush : మాట మార్చిన ఆదిపురుష్ రైటర్.. అప్పుడలా, ఇప్పుడిలా!

ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు, కొత్త రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఏం వెలగబెట్టాడని ప్రసన్న కుమార్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రజల్ని, కొత్త రాష్ట్రాన్ని పూర్తిగా మర్చిపోయాడని మండిపడ్డారు. టీడీపీ హయాంలో చంద్రబాబు, నారా లోకేష్ మాత్రం కోటీశ్వరులు అయ్యారే తప్ప.. పేదలు మాత్రం పేదవాళ్లుగానే ఉండిపోయారన్నారు. ఆ పేదరికాన్ని నిర్మూలించాలనే జగన్ పని చేస్తున్నారని చెప్పారు. పేదవాళ్లు ఆర్థికంగా ఎదగడం కోసం.. సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

Show comments