రేపు ఆనందయ్య మందుకు ప్రభుత్వ అనుమతులు రావచ్చు అని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయుష్ తుది నివేదిక కూడా రేపు ఇస్తారని ఆయుష్ కమిషనర్ రాములు కూడా చెప్పారు. సీఎం జగన్ కూడా ఈ మందు పై దృష్టి పెట్టారు అని తెలిపారు. ప్రభుత్వం నుండి ఖచ్చితంగా ప్రజలకు శుభవార్తే వస్తుంది. అనుమతులు లభించాక ఆనందయ్య మందు పంపిణీ చేస్తాం. ఇక ఆనందయ్యను నిర్బంధించారంటూ టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది అని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతూ వస్తున్న… మరణాలు మాత్రం తగ్గడం లేదు.