గుంజేపల్లిలో దళితుల ఆలయ ప్రవేశంపై కొందరు అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నారని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. గ్రామంలో సున్నితంగా ఉన్న సమస్యను కొందరు పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఇలాంటి ఆధునిక కాలంలో కూడా దళితులు ఆలయాల్లోకి రానివ్వకపోవడం ఏంటి…? అంటూ ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని మేము సూచించాం. అధికారులు చట్టం ప్రకారం ఏది ఉంటే అదే చేశారన్నారు. కొందరూ కులాలు అంటూ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారన్నారు.
Read Also: 70 ఏళ్లుగా ఇక్కడి ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేశారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
హిందూ ధర్మంలో కులాల ప్రస్తావనే లేదు.. ఇది తెలుసుకోండి..అంటూ దుయ్యబట్టారు. తాను కనిపించడం లేదంటూ వస్తున్న ప్రచారం పై ఎమ్మెల్యే పద్మావతి సీరియస్ అయ్యారు. ఈ నెల 16వ తేదిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఈలోపే అంత మిస్సయ్యారా.. అంటూ చురకలు అంటించారు. నాభర్తకు కరోనా రావడంతో రెండు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నాను. ఇక నుంచి రెగ్యూలర్‌గా కనిపించి అందరికీ సమాధానం ఇస్తాను అంటూ ఎమ్మెల్యే ప్రతిపక్షాలపై మండిపడ్డారు.