GO Number 1: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ని సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఈ నెల 23వ తేదీ వరకు జీవో నంబర్ 1ని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. జీవో నంబర్ 1ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక, జీవో నంబర్ 1 నిబంధనలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడిన హైకోర్టు.. దీనిపై ఈ నెల 20వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.. అయితే, జీవో నంబర్ వన్‌ను హైకోర్టు సస్పెండ్ చేయడంపై స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున.
Read Also: Jana Sena Yuvashakthi Public Meeting Live: జనసేన యువశక్తి భారీ బహిరంగ సభ లైవ్ అప్ డేట్స్
విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్సులో సాగుతున్న అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం పనులను పరిశీలించిన మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్.. జీవో నెంబర్-1 సస్పెండ్ చేసిన అంశంపై స్పందించారు.. జీవో నెంబర్-1 పేదల ప్రాణాలను కాపాడేందుకు తెచ్చిందన్నారు.. పేదలను చంద్రబాబు బారి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని.. జీవో నెంబర్-1కు మేం ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని.. పేద ప్రజల జీవనాన్ని న్యాయస్థానాలు గమనించాలి అని సూచించారు. పేదల కోసం జీవితంలో ఒకసారైనా చంద్రబాబు ఆలోచన చేశారా అని ప్రశ్నించారు మంత్రి మేరుగు నాగార్జున.
Read Also: Nalgonda Land Issue: భూవివాదం.. ట్రాక్టర్‌తో తొక్కించే యత్నం.. వీడియో వైరల్
ఇక, జీవో నెంబర్-1ని రాజకీయ కోణంలో చూడకూడదని హితవుపలికారు మంత్రి ఆదిమూలపు సురేష్.. ఇరుకు సందుల్లో సభలు, సమావేశాలు పెట్టే వారి కోసం జీవో తెచ్చామన్నారు. చంద్రబాబు పుష్కరాల్లో 29 మందిని బలి తీసుకున్నాడని ఫైర్ అయ్యారు.. తన సభల పేరుతో కందుకూరు, గుంటూరులో 11 మంది ప్రాణాలు తీశారని విమర్శించారు. మరోవైపు.. అడగకుండానే విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని ప్రశంసలు కురిపించారు మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున.. దేశ చరిత్రలో ఇలాంటి సాహసం ఎవరూ చేయలేదని.. అనుకున్న సమయానికి అంబేద్కర్ విగ్రహం పూర్తి చేయాలని సీఎం పనులు చేయిస్తున్నారని తెలిపారు. విగ్రహం కోసం రూ. 300 కోట్లు ఖర్చు చేస్తున్నాం.. విగ్రహం భాగాలన్నీ విడివిడిగా చేరుకుంటున్నాయని.. ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరిస్తామని వెల్లడించారు..
