NTV Telugu Site icon

Vidadala Rajini: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ ఇద్దరూ ఒక్కటే.. పేర్లే వేర్వేరు

Vidadala Rajini

Vidadala Rajini

Vidadala Rajini: టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ సమావేశం కావడంపై అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘాటుగా స్పందిస్తోంది.. ఇప్పటికే మంత్రులు, వైసీపీ నేతలు.. ఆ ఇద్దరు నేతలను టార్గెట్‌ చేస్తూ విమర్శలు సందిస్తున్నారు.. 11 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన చంద్రబాబును పవన్‌ కల్యాణ్‌ పరామర్శించడం ఏంటి అంటూ ఎద్దేవా చేస్తున్నారు.. తాజాగా, ఈ ఎపిసోడ్‌లో మంత్రి విడదల రజినీ హాట్‌ కామెంట్లు చేశారు.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ పేర్లే వేర్వేరు.. కానీ, మనుషులు ఇద్దరు ఒక్కటేనని ఆరోపించారు.. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయనేది వాళ్లు కలిసి చేస్తున్న దుష్ప్రచారమని తిప్పికొట్టిన ఆమె.. కందుకూరు, గుంటూరులో ప్రాణాలు కోల్పోయిన బాధితులను పరామర్శించ కుండా.. పవన్, చంద్రబాబు ఒకరిని ఒకరు పరామర్శ చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఫైర్ అయ్యారు.

Read Also: Chandrababu and Pawan Kalyan: పవన్, చంద్రబాబు ఏం చర్చించారు..? సీట్లు, ఓట్లు గురించా..? ప్యాకేజ్‌పైనా..?

ఇక, రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసి తీరుతాం.. ఆ దిశగా చిన్నచిన్న సమస్యలు ఉన్నా అధిగమిస్తామని ప్రకటించారు మంత్రి విడదల రజినీ.. ఆరోగ్య శ్రీ పథకం చంద్రబాబు పాలనలో అనారోగ్యం పాలైందన్న ఆరోపించారు.. 2030 నాటికి కేన్సర్ వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఒక్క పేషేంట్ కూడా బయట రాష్ట్రాలకు వెళ్లకూడదనేది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ధేశంగా చెప్పుకొచ్చారు.. మన్యం ప్రాంతంలో సికిల్ సెల్ ఎనీమియా టెస్టుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు.. ఫ్యామిలీ పీజీషియన్ వ్యవస్థను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి విడదల రజినీ..