NTV Telugu Site icon

Vidadala Rajini: జనసేన కార్యకర్తలు కావాలనే దాడి చేశారు.. ఎవరినీ వదిలిపెట్టం..!!

Vidadala Rajini

Vidadala Rajini

Vidadala Rajini: విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద మంత్రులపై జరిగిన దాడి ఘటనపై మంత్రి విడదల రజినీ స్పందించారు. జనసేన కార్యకర్తలు కావాలనే మంత్రులపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని ఎన్టీవీతో చెప్పారు. ఒకవేళ తాము జనవాణిని అడ్డుకోవాలని భావిస్తే ఇప్పటివరకు నాలుగు జనవాణిలు జరిగి ఉండేవి కావన్నారు. నిన్న ఎయిర్ పోర్ట్ దగ్గర ట్రాఫిక్‌లో తాను ఇరవై నిమిషాలు ఇరుక్కుపోయానని.. జనసేన కార్యకర్తలు తన కారు చుట్టూ చేరి ఫిల్తీ భాష ఉపయోగిస్తూ కర్రలతో కొట్టారని మంత్రి విడదల రజినీ వివరించారు. విశాఖ గర్జన గ్రాండ్ సక్సెస్ అయ్యిందనే కారణంతో జనసేన పక్కదారి పట్టించాలని ప్రయత్నం చేసిందన్నారు.

Read Also: RK Roja: బ్రేకింగ్.. మంత్రి రోజాపై జన సైనికుల దాడి

జేఏసీ పిలుపు ఇచ్చిన గర్జన కార్యక్రమాన్ని చాలా క్రమశిక్షణతో నిర్వహించారని మంత్రి విడుదల రజినీ తెలిపారు. కానీ జనసేన కార్యకర్తలు మాత్రం ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను లెక్కచేయకుండా జనసేన కార్యకర్తలు ప్రవర్తించారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే వారు దాడులకు పాల్పడ్డారని.. ఇలా దాడి చేస్తారని తాము ఊహించలేదన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి విడదల రజినీ పేర్కొన్నారు.