Seediri Appalaraju: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు.. శ్రీకాకుళం జిల్లా పలాసలోని ప్రగతి భవన్ ప్రాంగణంలో మందస మండల బూత్ కన్వీనర్లు, గృహసారధుల శిక్షణా శిభిరంలో మంత్రి అప్పలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బూత్ కన్వీనర్లు, గృహ సారథులకు దిశా నిర్దేశం చేశారు.. రాబోయే ఎన్నికల్లో 175కి 175 స్థానాలను గెలిచి తీరుతామని ధీమా వ్యక్తంచేశారు. గృహ సారథులు తమకు కేటాయించిన 50 ఇళ్లతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని సూచించారు. ప్రతి ఇంటితో మమేకమై సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని కోరారు.. అయితే, ఒక వేళ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే.. అమ్మ ఒడి ఆపేస్తాడు.. చేయూత తీసేస్తాడు.. విద్యాదీవెన, వసతి దీవెన అటకెక్కిస్తాడు.. మళ్లీ ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకెళ్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
ఇక, చంద్రబాబు గనుక మళ్లీ అధికారం చేపడితే.. జన్మభూమి కమిటీలని, సాధికారత సారథులని మళ్లీ జనాలను పీల్చి పిప్పి చేసి పిండా కూడు చేసేస్తాడని వ్యాఖ్యానించారు మంత్రి.. ప్రజలకు వివరించి సీఎం జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూలత వచ్చేలా తెలియజేయాలని గృహసారథులను , కన్వీనర్లను కోరారు. ప్రతి ఇంటితో మమేకమై ఎవరికైనా పథకాలు రాకపోతే ఇప్పించి తీరాలని అన్నారు. వాళ్ల కు కష్టం వచ్చినా మేమున్నామన్న భరోసా ఇస్తే 175 కి 175 స్థానాలు గెలుచి తీరుతామన్న ధీమాను వ్యక్తం చేశారు. మార్చి ఒకటో తేదీన కోడి కూయక ముందే పెన్షన్ పెట్టి ఒక మంచి ప్రభుత్వం.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని చాటాలని గృహ సారథులను సూచించారు మంత్రి సీదిరి అప్పలరాజు.