Site icon NTV Telugu

RK ROJA: తప్పు చేసిన వారు తప్పించుకోలేరు

Roja1 (1)

Roja1 (1)

తప్పు చేసినవారు ఎన్నో రోజులు తప్పించుకోలేరని మంత్రి ఆర్ కె రోజా అన్నారు. గుంటూరు వారి తోటలో వినాయక నవరాత్రులలో భాగంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి ఆర్కే రోజా. రాష్ట్రానికి అవసరం లేని విషయాలపై టీడీపీ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని అడ్డంపెట్టుకుని నెల రోజులు రాజకీయం చేశారు.

Read Also: Suella Braverman: యూకే హోం సెక్రటరీగా భారత సంతతి వ్యక్తి.

ఆయన తప్పు చేశాడా… లేదా అనేది భగవంతుడు చూస్తుంటాడు. తప్పు చేసినవారు ఎన్నో రోజులు తప్పించుకోలేరు. అన్న క్యాంటీన్ల విషయంలో టీడీపీ కోడిగుడ్డు మీద ఈకలు పీకే రాజకీయం చేస్తుందని విమర్శించారు. నిజంగా ఎన్టీఆర్ పై ప్రేమ ఉంటే అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు ఎందుకు ప్రారంభించలేదని రోజా ప్రశ్నించారు. ఎన్నికలకు మూడు… నాలుగు నెలల ముందు నాలుగు అన్న క్యాంటీన్లు ప్రారంభించి మేము పెట్టాం. మీరు తీసేశారని ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని టీడీపీ నేతలు చూస్తున్నారు. తప్పుడు ఆరోపణలు చేసినవారు ఫూల్స్ అవుతారన్నారు మంత్రి రోజా.

Read Also: Wife Killed Husband: ఫోన్‌ లో మాట్లాడుతుందని మందలించిన భర్త.. గొంతు నులిమి హత్య చేసిన భార్య

Exit mobile version