NTV Telugu Site icon

Minister Roja: పవన్ సినిమాల్లో గబ్బర్‌ సింగ్‌.. రాజకీయాల్లో రబ్బర్‌ సింగ్‌

Roja Fires On Pawan Kalyan

Roja Fires On Pawan Kalyan

Minister Roja Fires Says Pawan Kalyan Is Rubber Singh In Politics: ఏపీ మంత్రి రోజా మరోసారి జనసేనాధిపతి పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగారు. పవన్ కేవలం సినిమాల్లో మాత్రమే గబ్బర్ సింగ్ అని.. రాజకీయాల్లో మాత్రం రబ్బర్ సింగ్ అని ఎద్దేవా చేశారు. రెండు చోట్ల ఓడిన పవన్‌ని చూసి ఎవరూ భయపడరని తేల్చి చెప్పారు. పవన్ ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేడని అభిప్రాయపడ్డారు. పవన్ తనని డైమండ్ రాణి అన్నారని, తాను నిజంగానే రాణినే అని పేర్కొన్నారు. సినిమాల్లో నటిగా, ఇంట్లో ఇల్లాలుగానే కాకుండా రాజకీయాల్లోనూ తనని తాను నిరూపించుకొని రాణిలా ఉన్నానన్నారు. తన గురించి పవన్ మరోసారి ఏమైనా మాట్లాడితే బాగుందంటూ వార్నింగ్ ఇచ్చారు.

South India Science Expo : సౌత్ ఇండియా సైన్స్ ఎక్స్‌పోకు ఎంపికైన ఖమ్మం విద్యార్థి

చంద్రబాబు సైకోకు పరాకాష్టగా మారారని, జనం రాకపోవడంతో రోడ్లపై సభలు పెడుతున్నారని రోజా చెప్పారు. చంద్రబాబు, పవన్‌లకు పదువులే ముఖ్యమని.. ప్రజల సమస్యల్ని పట్టించుకోరని ఉద్ఘాటించారు. ఇదే సమయంలో తనకు, చిరంజీవికి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఇక సీఎం జగన్ అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నారని పేర్కొన్నారు. అందుకే.. ఒంటరిగా ఎదుర్కునే ధైర్యం లేక, అన్నీ పార్టీలు కలిసి గుంపులుగా వస్తున్నాయన్నారు. ఎవరెంతమంది కలిసి వచ్చినా.. ప్రజల్లో సీఎం జగన్‌కి ఉన్న ఆదరణని చెరపలేరన్నారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ కచ్ఛితంగా 175 స్థానాల్లో విజయం సాధిస్తారన్నారు. సింహం సింగిల్‌గానే వస్తుందని, వచ్చే ఎన్నికల్లో తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు.

Raviteja: అన్నయ్య ఇవన్నీ కాదు, ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ సినిమా చేద్దాం

అంతకుముందు.. పవన్‌ను జోకర్‌గా అభివర్ణించిన రోజా, నాగబాబుపై కూడా పంచ్‌లు వేశారు. నాగబాబు మనిషిగా ఎదిగారు గానీ, మెదడు పెరగలేదని కౌంటర్ వేశారు. పవన్‌కి, నాగబాబుకి మేల్ ఈగో అనేది ఎక్కువగా ఉందన్నారు. ఆ ఇద్దరికి రాసిచ్చిన స్క్రిప్టులు చదవడం తప్ప ఇంకేం తెలియదని ఎద్దేవా చేశారు. కనీసం ఒక్క చోట కూడా గెలవని ఆ ఇద్దరు తనపై వ్యాఖ్యలు చేయడం చిల్లరగా ఉందన్నారు. తాను కళాకారులతో డ్యాన్స్ చేస్తే, వారు ట్రోల్ చేస్తున్నారని.. వారు మాత్రం కూతురు వయస్సున్న అమ్మాయిలతో డ్యాన్స్ చేయడం కరెక్టేనా అని ప్రశ్నించారు. పవన్ అన్నింటిలోనూ ఫెయిల్యూర్ అని ఉద్ఘాటించారు.

Mumbai Indians Junior: ఆకాశమే హద్దుగా చెలరేగిన చిచ్చరపిడుగు.. 178 బంతుల్లో 508 పరుగులు

Show comments