Minister Roja: పవన్ సినిమాల్లో గబ్బర్ సింగ్.. రాజకీయాల్లో రబ్బర్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Roja Fires Says Pawan Kalyan Is Rubber Singh In Politics: ఏపీ మంత్రి రోజా మరోసారి జనసేనాధిపతి పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగారు. పవన్ కేవలం సినిమాల్లో మాత్రమే గబ్బర్ సింగ్ అని.. రాజకీయాల్లో మాత్రం రబ్బర్ సింగ్ అని ఎద్దేవా చేశారు. రెండు చోట్ల ఓడిన పవన్‌ని చూసి ఎవరూ భయపడరని తేల్చి చెప్పారు. పవన్ ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేడని అభిప్రాయపడ్డారు. పవన్ తనని డైమండ్ రాణి అన్నారని, తాను నిజంగానే రాణినే అని పేర్కొన్నారు. సినిమాల్లో నటిగా, ఇంట్లో ఇల్లాలుగానే కాకుండా రాజకీయాల్లోనూ తనని తాను నిరూపించుకొని రాణిలా ఉన్నానన్నారు. తన గురించి పవన్ మరోసారి ఏమైనా మాట్లాడితే బాగుందంటూ వార్నింగ్ ఇచ్చారు.
South India Science Expo : సౌత్ ఇండియా సైన్స్ ఎక్స్‌పోకు ఎంపికైన ఖమ్మం విద్యార్థి
Also Read
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
- Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
చంద్రబాబు సైకోకు పరాకాష్టగా మారారని, జనం రాకపోవడంతో రోడ్లపై సభలు పెడుతున్నారని రోజా చెప్పారు. చంద్రబాబు, పవన్‌లకు పదువులే ముఖ్యమని.. ప్రజల సమస్యల్ని పట్టించుకోరని ఉద్ఘాటించారు. ఇదే సమయంలో తనకు, చిరంజీవికి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఇక సీఎం జగన్ అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నారని పేర్కొన్నారు. అందుకే.. ఒంటరిగా ఎదుర్కునే ధైర్యం లేక, అన్నీ పార్టీలు కలిసి గుంపులుగా వస్తున్నాయన్నారు. ఎవరెంతమంది కలిసి వచ్చినా.. ప్రజల్లో సీఎం జగన్‌కి ఉన్న ఆదరణని చెరపలేరన్నారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ కచ్ఛితంగా 175 స్థానాల్లో విజయం సాధిస్తారన్నారు. సింహం సింగిల్‌గానే వస్తుందని, వచ్చే ఎన్నికల్లో తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు.
Raviteja: అన్నయ్య ఇవన్నీ కాదు, ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ సినిమా చేద్దాం
అంతకుముందు.. పవన్‌ను జోకర్‌గా అభివర్ణించిన రోజా, నాగబాబుపై కూడా పంచ్‌లు వేశారు. నాగబాబు మనిషిగా ఎదిగారు గానీ, మెదడు పెరగలేదని కౌంటర్ వేశారు. పవన్‌కి, నాగబాబుకి మేల్ ఈగో అనేది ఎక్కువగా ఉందన్నారు. ఆ ఇద్దరికి రాసిచ్చిన స్క్రిప్టులు చదవడం తప్ప ఇంకేం తెలియదని ఎద్దేవా చేశారు. కనీసం ఒక్క చోట కూడా గెలవని ఆ ఇద్దరు తనపై వ్యాఖ్యలు చేయడం చిల్లరగా ఉందన్నారు. తాను కళాకారులతో డ్యాన్స్ చేస్తే, వారు ట్రోల్ చేస్తున్నారని.. వారు మాత్రం కూతురు వయస్సున్న అమ్మాయిలతో డ్యాన్స్ చేయడం కరెక్టేనా అని ప్రశ్నించారు. పవన్ అన్నింటిలోనూ ఫెయిల్యూర్ అని ఉద్ఘాటించారు.
Mumbai Indians Junior: ఆకాశమే హద్దుగా చెలరేగిన చిచ్చరపిడుగు.. 178 బంతుల్లో 508 పరుగులు
తాజావార్తలు
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
-
Truecaller Scam Checker: ఆన్లైన్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు Truecaller కొత్త ఫీచర్.. నంబర్, లింక్, మెసేజ్ అన్నీ ఒకేచోట చెక్..
-
Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్‌లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!