మంత్రి రోజా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. పవన్ డైమాండ్ రాణి మాటకు రోజా కౌంటర్ వేశారు. అది కూడా మామూలుగా కాదు.. కాస్త వెటకారంగా. పవన్ కల్యాణ్ పొలిటికల్ జోకర్ అనేశారు రోజా సెల్వమణి. జగన్ లా నేను పోటీ చేయలేను.. నాకు చేత కాదు అని పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడన్నారు. అదీ జగన్ పవరంటే అన్నారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టలేనని నిస్సహాయత వ్యక్తం చేశారన్నారు.