NTV Telugu Site icon

Minister Roja: కొడాలి నానికి మంత్రి రోజా బర్త్ డే విషెస్.. అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలుపు

Kodali Nani Birthday

Kodali Nani Birthday

Minister Roja: వైసీపీలో ఫైర్‌బ్రాండ్లు ఎవరంటే అందరూ టక్కున మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నాని పేర్లు చెప్తారు. వీళ్లిద్దరూ ప్రెస్‌మీట్‌కు వచ్చి మాట్లాడితే ప్రతిపక్షాలకు పంచ్‌లు పడాల్సిందే. ఈ నేపథ్యంలో శనివారం నాడు మాజీ మంత్రి కొడాలి నాని పుట్టినరోజు కావడంతో మంత్రి రోజా స్పెషల్‌గా విషెస్ తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్ డే కొడాలి నాని అన్నయ్యా’ అంటూ సోషల్ మీడియాలో మంత్రి రోజా పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. ‘నీ అంత మంచి వ్యక్తులు మరెవ్వరూ ఉండరు బ్రదర్. నువ్వు విలక్షణమైన వ్యక్తివి, అద్భుతమైన వ్యక్తిత్వం నీ సొంతం’ అంటూ కొడాలి నానిపై మంత్రి రోజా ప్రశంసలు కురిపించారు. అంతేకాదు, కొడాలి నానితో దిగిన సెల్ఫీని కూడా ఆమె పోస్ట్ చేశారు.

Read Also: Pawan Kalyan: అక్రమాలకు బయటకు వస్తాయని భయపడి తప్పుడు కేసులు పెట్టారు

ఏపీలో వైసీపీ అధికారం చేపట్టగానే కొడాలి నానికి సీఎం జగన్ పౌర సరఫరాల శాఖ అప్పగించారు. దాదాపు మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగారు. అయితే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో కొడాలి నానికి మరోసారి మంత్రిగా అవకాశం లభించలేదు. అటు నగరి ఎమ్మెల్యే రోజా మంత్రి వర్గ విస్తరణలో టూరిజం మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ఈరోజు కొడాలి నాని పుట్టినరోజు కావడంతో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా కొడాలి నాని, రోజా ఇద్దరూ నేతలు గతంలో టీడీపీలో కలిసి పనిచేసి ఇప్పుడు వైసీపీలో కొనసాగుతుండటం గమనించదగ్గ విషయం.

Show comments