టీడీపీ, జనసేన పార్టీలపై నిప్పులు చెరిగారు మంత్రి ఆర్ కె రోజా. తిరుమల పర్యటనలో ఆమె టీడీపీ నేతల్ని తీవ్రంగా విమర్శించారు. పదవ తరగతి ఉత్తీర్ణత పై టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు. ఒంగోలులో జరిగిన మహానాడులో తొడగోట్టి రమ్మని పిలిచిన టీడీపీ నేతలు లోకేష్ జూమ్ మీటింగ్ కి కొడాలి నాని,వంశీ వస్తే ఎందుకు పారిపోయారని ఆమె ప్రశ్నించారు.
కోవిడ్ కారణంగా పాఠశాలలు సరిగా జరగలేదని, విద్యార్ధులు ఆన్ లైన్ పాఠాలు విన్నారన్నారు. పిల్లలు సరిగ్గా చదువుకోకపోవడం వలన ఉత్తీర్ణత తగ్గిందన్నారు మంత్రి రోజా. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి టీడీపీపై కోపం. అందుకే పదే పదే పార్టీ మూసేస్తా అంటున్నాడని ఎద్దేవా చేశారు రోజా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నాడో చెప్పాలని మంత్రి రోజా డిమాండ్ చేశారు.
మరోవైపు తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి రాంభగీచా అతిధి గృహాలు వరకు క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. సర్వదర్శనానికి 25 గంటల సమయం పడుతోంది. తిరుమలకు రావాలనుకునే భక్తులు తమ పర్యటన వాయిదా వేసుకుంటే మంచిది. తిరుమలలో మంత్రి రోజా డ్రైవర్ హల్ చల్ చేశాడు. మహాద్వారం నుంచి ఆలయ ప్రవేశం చేశాడు మంత్రి రోజా డ్రైవర్. ప్యాంట్ ధరించి వీఐపీ బ్రేక్ దర్శనం క్యూ లైనులో వస్తూండడంతో అనుమానంతో మహాద్వారం వద్ద గుర్తించింది విజిలెన్స్. దీంతో రోజా డ్రైవర్ ని వెనక్కి పంపించారు విజిలెన్స్ అధికారులు.
Rajyasabha Results: 8 స్థానాల్లో ఫలితాలు.. కాంగ్రెస్, బీజేపీలకు చెరో నాలుగు