Site icon NTV Telugu

Minister Roja: భీమ్లానాయక్ బిగుసుకుపోయారు.. చంద్రబాబు నీరుగారిపోయారు..!

Minister Rk Roja

Minister Rk Roja

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన విజయవంతం అయ్యిందని.. భీమవరం కార్యక్రమం విజయవంతం కావడంతో భీమ్లానాయక్ గారు బిగుసుకుపోయారు.. చంద్రబాబు నీరుగారిపోయారు అంటూ సెటైర్లు వేశారు మంత్రి ఆర్కే రోజా.. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం జగన్నాథపురంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించారు మంత్రి ఆర్కే రోజా.. ఈ కార్యక్రమాల్లో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ మార్గాని భరత్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ.. దేశమంతా చూసేలా రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి విగ్రహావిష్కరణ చేసిందన్నారు.. ప్రధాని మోడీని ఘనంగా స్వాగతించి కార్యక్రమం విజయవంతం చేశామన్న ఆమె.. భీమవరం కార్యక్రమం విజయవంతం కావడంతో భీమ్లానాయక్ గారు బిగుసుకుపోయారు.. చంద్రబాబు నీరుగారిపోయారు అంటూ ఎద్దేవా చేశారు.

Read Also: GodFather: ‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్‌లో ఏముంది!?

ఇక, చంద్రబాబు, లోకేష్… పవన్ కల్యాణ్‌ని జాకీలు వేసి లేపాలని చూస్తున్నారంటూ కామెంట్ చేశారు ఆర్కే రోజా.. జాకీలు విరిగీపోతున్నాయి.. కానీ, వాళ్లు పైకి లేవడంలేదన్న ఆమె.. అధికారంలో వస్తే సంక్షేమ పథకాలు, సచివాలయాలు రద్దు చేస్తామని టీడీపీ నేతలు ప్రకటించేస్తున్నారని విమర్శలు గుప్పించారు. కాగా, ఇవాళ ఏపీలో పర్యటించారు ప్రధాని నరేంద్ర మోడీ.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన.. అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.. తెలుగువీరలేవరా.. దీక్ష బూని సాగరా.. అంటూ తెలుగులో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు.. ఇక, అల్లూరి జీవితం భారతీయులందరికీ స్ఫూర్తినిచ్చిందన్నారు. స్వాతంత్ర్యం కోసం అల్లూరి చేసిన పోరాటం చాలా గొప్పదని.. భవిష్యత్ తరాలకు ఆయన స్ఫూర్తిగాధ తెలియాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. ఆ తర్వాత గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని నరేంద్ర మోడీకి గవర్నర్‌, సీఎం జగన్‌ వీడ్కోలు పలికారు.. ఏపీకి నిధులు కేటాయించాలంటూ.. ఓ విజ్ఞాపన పత్రాన్ని కూడా పీఎంకు సమర్పించారు సీఎం జగన్.

Exit mobile version