ఆన్ లైన్ సినిమా టికెట్ విధానాన్ని సినీ ప్రముఖులే కోరారు: పేర్ని నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వం మల్టీప్లెక్స్ లతో సహా సినిమా థియేటర్స్ కోసం ఆన్ లైన్ టికెట్ బుకింగ్ సేవలను ప్రవేశపెట్టనున్నారనే వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే.. అయితే ఈ విధానాన్ని సినీ ప్రముఖులే కోరారని మంత్రి పేర్ని నాని తెలిపారు. ‘సినీ పెద్దల సూచననే ప్రభుత్వం పరిశీలించిందని, పన్ను ఎగవేత జరుగుతోందని ప్రభుత్వం గమనించిందన్నారు. బ్లాక్ టిక్కెట్లు లేకుండా అరికట్టడానికి, ప్రజలకు మేలు చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. సినిమా టికెట్లను ప్రభుత్వమే అమ్మాలనే విషయంపై ఇంత వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేశారు.
టిక్కెట్ రేట్లను, ఇష్టానుసారంగా షోలు వేయడాన్ని నియంత్రిస్తూ ఏప్రిల్ 8వ తేదీన ఇచ్చిన జీవో ఇచ్చాము. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే టిక్కెట్ల విక్రయం జరిపేలా ఆదేశాలిచ్చాము. ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ నిర్ణయించిన ధరలకు ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకానికి సంబంధించి అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేసింది. దీనిపై అర్ధం లేని విధంగా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేసే ప్రయత్నం చేయొద్దన్నారు.
Also Read
- AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
- Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్‌పై సీఎం చంద్రబాబు ఫైర్!
2002 ఏడాదిలో ఈ ఆన్ లైన్ సిస్టమ్ ద్వారా సినిమా టిక్కెట్లను అమ్మించే ప్రయత్నం చేయండని కేంద్రం కోరాము. పన్నుల ఎగవేత అరికట్టొచ్చని గతంలో ప్రభుత్వాలు భావించాయి. ఆన్ లైన్లో సినిమా టిక్కెట్లను అమ్మొచ్చని గత ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సమ్మతి తెలుపుతూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అంగీకారం తెలిపింది. ఎవరికో మేలు చేయడానికి విమర్శలు చేయడం సరికాదు. ప్రభుత్వ ఆలోచనను అర్ధం చేసుకోవాలని మంత్రి కోరారు.
నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్లు.. సినిమా హాళ్ల యాజమాన్యాలతో త్వరలో సమావేశం జరపనున్నాము. ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ నేతృతంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. జగన్ ప్రభుత్వం ఏ మంచి చేస్తోన్నా విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఆన్ లైన్ విధానం మంచిదని సినీ ప్రముఖులు చాలా మంది చెబుతున్నారు.సినీ ఇండస్ట్రీ పెద్దలు సీఎం జగన్ తో భేటీ అవుతామని కోరారు. ఆగస్టులో భేటీ కావాలని భావించినా కుదర్లేదు. త్వరలోనే సినీ పెద్దలు సీఎం జగన్ తో భేటీ కానున్నారని’ మంత్రి పేర్ని నాని తెలిపారు.
తాజావార్తలు
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!