ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తో చర్చించారు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని. ఈ నెల 10న సీఎం జగన్ తో చిరంజీవి సహా ఇతర సినిమా పెద్దల సమావేశం వున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ తో సినిమటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం ను కలిసిన మంత్రి పేర్ని నాని పలు అంశాలు చర్చించారు. సినిమా టికెట్ల ధరల పెంపు అంశం ప్రస్తావనకు వచ్చింది. సినిమా టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వం నియమించిన కమిటీ చేసిన అధ్యయనంపై చర్చించారు.
Read Also పీఆర్సీ రగడ.. సీఎం జగన్‌కు హైకోర్టు ఉద్యోగుల లేఖ
ఈ నెల 10న సీఎం జగన్ తో చిరంజీవి సహా ఇతర సినిమా పెద్దల సమావేశం వున్న సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై కమిటీ నివేదిక దాదాపు సిద్దమైంది. సినిమా టికెట్ల కనీస ధర, గరిష్ట ధరలు ఎంత ఉండాలనే అంశంపై చర్చించారని తెలుస్తోంది. సినిమా ప్రముఖులతో భేటీలో వారి అభిప్రాయాలు తీసుకుని చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. సినిమా ధియేటర్ల యజమానుల సమస్య పరిష్కారంపైన చర్చ జరిగిందని తెలుస్తోంది.