Site icon NTV Telugu

అభివృద్ధి విషయంలో ఎక్కడా వెనుకడుగు వేయం: రామచంద్రారెడ్డి

చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో మూడో రోజు కొనసాగుతున్న పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పల్లెబాట కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ కార్యక్రమాలు ఇంటింటికి చేరుతున్నాయన్నారు. అందుకే ఎక్కడికి వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారని ఆయన అన్నారు. గతంతో పోలిస్తే సమస్యలపై వచ్చే దరఖాస్తులు 90శాతం మేర తగ్గాయని పేర్కొన్నారు.

https://ntvtelugu.com/police-catch-vehicle-thief/

అభివృద్ధి విషయంలో ఎక్కడా వెనుకడు వేయలేదని మంత్రి తెలిపారు. నీళ్లు, రోడ్లు అంటూ అన్ని మౌలికవసతులు పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్నారు. నాలుగు రోజుల చౌడేపల్లి పర్యటన రేపటితో ముగియనుంది. మిగిలిన మండలాల్లో సైతం త్వరలోనే పర్యటిస్తామన్నారు. పల్లెల సందర్శన అనంతరం వార్డు బాటను కూడా నిర్వహించనున్నట్టు మంత్రి వెల్లడించారు.

Exit mobile version