NTV Telugu Site icon

Minister Parthasarathy: డి. శ్రీనివాస్ మృతి పట్ల మంత్రి పార్థసారథి సంతాపం..

Minister Paretha

Minister Paretha

Minister Parthasarathy: మాజీ మంత్రి వర్యులు ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ కొలుసు పార్థసారథి సంతాపం వ్యక్తం చేశారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ మంత్రి, ఎంపీ, పీసీసీ చీఫ్ గా ఎన్నో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించిన ధర్మపురి శ్రీనివాస్ మరణ వార్త బాధాకరం.. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రజా సేవకు అంకితమైన నాయకుడు డీఎస్ అని మంత్రి చెప్పుకొచ్చారు. తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది అని పార్థసారథి వెల్లడించారు.

Read Also: Kalki 2898 AD Part 2: కల్కి 2 రిలీజ్ అప్పుడే.. షూటింగ్ ఎంత అయిందంటే?

ఇక, డి.శ్రీనివాస్ ఎప్పుడూ హుందాగా వ్యవహరించేవారు.. తాను నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసే వారు అని మంత్రి పార్థసారథి తెలిపారు. అందరితో సమన్వయంతో పని చేస్తూనే.. పని చేసే నాయకులకు ప్రాధాన్యం ఇచ్చేవారు.. యువతను ఎక్కువగా ప్రోత్సహించారు.. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి, ఐ అండ్ పీఆర్, ఉన్నత విద్య, అర్బన్, ల్యాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా విశేష సేవలు అందించిన వ్యక్తి డిఎస్ అని ఆయన కోనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియాశీలకంగా వ్యవహరించి తనదైన ముద్ర వేసిన డి. శ్రీనివాస్ మరణం తీరని లోటు అని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.