NTV Telugu Site icon

Nara Lokesh: చట్టాన్ని ఉల్లంఘించి జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా..?

Lokesh

Lokesh

Nara Lokesh: తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి నారా లోకేశ్ ఖండించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఆయన మాట్లాడుతూ.. జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ప్రజలే నిర్ణయించారు.. అది ఆయనకి తెలియడం లేదు అంటూ ఎద్దేవా చేశారు. ఒక్క రోజే అసెంబ్లీకి వచ్చి వెళ్తారు.. మళ్లీ కనిపించరు.. ఇక, చర్చ జరగాలంటే అసెంబ్లీకి రావాలి కదా.. జగన్ను ఎవరు రావొద్దన్నారు.. ప్రజా సమస్యల గురించ జగన్ అసెంబ్లీలో ప్రస్తావించొచ్చు అని మంత్రి లోకేశ్ వెల్లడించారు.

Read Also: Harihara Veeramallu: ఏపీలో హరిహర వీరమల్లు షూట్.. పవన్ కోసం వెయిటింగ్!

ఇక, చట్టాన్ని ఉల్లంఘించి వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అని మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. రూల్స్ అతిక్రమించడం జగన్కు అలవాటు.. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించారు.. ఇప్పుడు, బెంగళూరులో ఉంటూ ఇక్కడి ఎన్నికల గురించి మాట్లాడితే ఎలా అని అడిగారు. ఇంతకీ, జగన్ పొలిటీషియనా.. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అన్నారు. అహంకారానికి ప్యాంట్, షర్ట్ వేస్తే జగన్.. అతడు, ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.. పవన్ కళ్యాణ్ను కించపర్చేలా మాట్లాడుతున్నారు.. అలా, మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. నేతలు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి అని నారా లోకేశ్ సూచించారు.