Site icon NTV Telugu

Minister Nara Lokesh: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలో టీచర్ల భర్తీ కోసం మరో DSC

Lokesh

Lokesh

Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జరిగిన క్వశ్చన్ అవర్ లో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. త్వరలో టీచర్ల భర్తీ కోసం మరో DSC నిర్వహిస్తున్నామని తెలిపారు. టీచర్- స్టూడెంట్ రేషియో కర్నూలుతో పాటు కొన్ని పార్లమెంట్లలో తక్కువగా ఉంది.. త్వరలోనే భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నాం.. రాయలసీమలో సీజనల్ హాస్టల్స్ ను కూడా పెంచుతాం.. సమగ్ర శిక్ష అభియాన్ కింద పని చేస్తున్న ఉపాధ్యాయులు, డేటా ఆపరేటర్లకు మన రాష్ట్రంలో ఇస్తున్న జీతాలు అన్ని రాష్ట్రాలకంటే ఎక్కువ అన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం కాబట్టి జీతాల పెంపు అంశం కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంటుంది అని నారా లోకేష్ వెల్లడించారు.

Read Also: Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి సినిమాకు బ్రేక్

అయితే, త్వరలో కేంద్రంతో జరగనున్న సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ తో ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం.. కర్నూలు ప్రాంతంలోని విద్యా సంస్థలలో అనేక కొత్త కోర్సులు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాం.. స్థానికంగా అనేక రంగాలలో పరిశ్రమలు వస్తున్న నేపథ్యంలో వాటికి అనుగుణంగా కోర్సులు పెట్టే ఆలోచన చేస్తున్నాం.. స్కూల్స్ లో మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు.

Exit mobile version