Site icon NTV Telugu

Deputy CM Pawan: పవన్తో నా ప్రయాణం అలా మొదలైంది.. నాదెండ్ల ట్వీట్కి డిప్యూటీ సీఎం రియాక్షన్

Pawqan

Pawqan

Deputy CM Pawan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యా్ణ్ తో తన ప్రయాణం మొదలైన రోజును మంత్రి నాదెండ్ల మనోహర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా 2018 అక్టోబర్ 12వ తేదీన ప్రారంభమైన ప్రయాణం జనసేనతో నా రాజకీయ ఆరంభం అంటూ అప్పటి ఫోటోను షేర్ చేశారు. పవన్ దిశా నిర్దేశం, స్ఫూర్తినిచ్చే నాయకత్వం ఎప్పుడూ మాకు బలమైంది.. తిత్లీ తుఫాన్ తర్వాత శ్రీకాకుళంలో యువతతో కలిసి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్‌పై చర్చలు జరిపాం అన్నారు. యువత ఆకాంక్షలను ప్రతిబింబించే ఏపీ కోసం కృషి చేస్తున్నామన్నారు. అయితే, జనసేన అధ్యక్షుడు, పార్టీ నాయకులు, వీర మహిళల మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. ఏడేళ్ల రాజకీయ ప్రయాణంలో సేవ, స్ఫూర్తి, సంకల్పంతో నిండినది అని మత్రి నాదెండ్ల ట్వీట్ చేశారు.

Read Also: AmalaPaul : అమల పాల్.. ఫోటోలు అదరహో..

ఇక, మంత్రి నాదెండ్ల మనోహర్ ట్వీట్ పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. వాళ్లు ఉచితాల కోసం అడగలేదు.. సంక్షేమ పథకాల కోసం కోరలేదు.. ఒకే మాట చెప్పారు మాకు ఉచితాలు కాదు, భవిష్యత్తు కావాలి అన్నారు. 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వండి, ఉచితాలు కాదు ఇదే యువత యొక్క స్వరం అన్నారు. యువతలోని నిజమైన సామర్థ్యాన్ని వెలికి తీయాలని పేర్కొన్నారు. వారి కలలు నెరవేర్చేందుకు నేను నిరంతరం యువతను
కలుస్తూనే ఉంటాను అని ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు.

Exit mobile version