Minister Meruga Nagarjuna Fires On Chandrababu Naidu: ఎస్సీ, ఎస్టీలను దగా చేయటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని.. ఇప్పుడు ఆయన శకం ముగిసిందని ఏపీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. టీడీపీ ఒక అహంకార పార్టీ అని, రాజ్యాంగబద్దంగా వచ్చిన హక్కులను హరించటం వారికి అలవాటు అయ్యిందని ఆరోపించారు. తన హయాంలో చంద్రబాబు దళితులకు ఒక్క మంచి పని కూడా చేయలేదని, టీడీపీ దళిత వ్యతిరేక పార్టీ అని వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి మద్దతిచ్చే మీడియా సైతం దళిత వ్యతిరేకులేనని మండిపడ్డారు.
CPI Ramakrishna: రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది.. అభివృద్ధి ఎక్కడా జరగలేదు
పేద పిల్లలకు ఇంగ్లీష్ విద్యను, అమరావతి ప్రాంతంలో దళితులకు భూమి ఇస్తామంటే.. వాళ్లు వ్యతిరేకిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. దళితులకు ఒక్క మంచి పని కూడా చేయని చంద్రబాబు.. అంబేద్కర్ విగ్రహాన్ని కడతామని చెప్పి, ఎందుకు ఆ పని చేయలేదని ప్రశ్నించారు. దళితులు గౌరవంతో తలెత్తుకునేలా తమ నాయకుడు జగన్ చేస్తున్నారని.. శాచురేషన్ విధానంలో దళితులకు, పేదలకు సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. ఎవరైనా ఎస్సీ కులాల్లో పుట్టాలని అనుకుంటారా అని చంద్రబాబు చెప్పలేదా? బీసీ కులాల తోకలు కత్తిరిస్తానని అహంకారం ప్రదర్శించింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అంబేద్కర్ చెప్పిన ఆశయాలకు అనుగుణంగా వైసీపీ పాలన సాగుతోందని.. కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న ప్రతీ పైసాను తమ ప్రభుత్వం దళితుల కోసం ఖర్చు చేస్తోందని అన్నారు.
A Strange Case: భర్తపై భార్య అత్యాచారం.. 29 గంటలపాటు ఏకధాటిగా
తమ వర్గాలకు చంద్రబాబు చేసిన మోసాలు.. ఇంకా తమ గుండెల్లో గునపాల్లా గుచ్చుకుంటూనే ఉన్నారని మేరుగ నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. దళిత సంక్షేమానికి, అంబేద్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా జగన్ పాలన చేస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో అంబేద్కర్ విదేశీ విద్యలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని.. ఎస్సీ కార్పొరేషన్‌కు వాహనాల కొనుగోళ్ళల్లో అవకతవకల అంశాన్ని సైతం సీఐడీకి అప్పగించామని పేర్కొన్నారు. రూ. 48 కోట్లు అడ్వాన్స్ రూపంలో ప్రభుత్వం చెల్లించినా.. వాహనాలు డెలివరీ అవ్వలేదని మండిపడ్డారు.