Minister Kollu Ravindra: కృష్ణా జిల్లా గుడివాడలో మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీపై తీవ్రంగా మండిపడ్డారు. రప్పా రప్పా అన్ని రోడ్లపై తిరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా.. సినిమా డైలాగులు చెబితే తప్పేంటని నీసిగ్గుగా మాట్లాడుతున్నారు.. జగన్ విధానాలను ప్రజలందరూ గమనిస్తున్నారు.. ఇలానే ఉంటామంటే 11 నుంచి ఒకటికి పడిపోవడం ఖాయం అని ఎద్దేవా చేశారు. సాక్షాత్తు జగనే వాయిదాలు ఎగ్గొట్టి తిరుగుతున్నాడు.. చిత్తశుద్ధి ఉంటే కోర్టులలో తమ తప్పు లేదని నిరూపించుకోవాలని సూచించారు. అధికారంలో ఉండగా మాపై జగన్ పెట్టించినవి అక్రమ కేసులని నిరూపించుకోలేదా?.. కేసులపై ఇప్పుడెందుకు నీతి కబుర్లు చెబుతున్నారు? అని అడిగారు. మాకు శత్రువులంటూ ఎవరూ లేరు.. చట్టానికి వ్యతిరేకంగా వెళ్తే సహించేది లేదు అని కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు.
Read Also: Minister Anagani: 2047 నాటికి రాష్ట్రాన్ని నెంబర్-1 చేసేలా సీఎం చంద్రబాబు ప్లాన్
ఇక, దాడులతో విర్రవీగిన వ్యక్తులందరికీ నాడు జగన్ అందలమెక్కించారు అని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. ఇప్పుడు తీరు మార్చుకోకుండా బియ్యం దోచుకున్న పేర్ని నానితో.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారు.. దోపిడీదారులు, దొంగలు వచ్చి నీతి కబుర్లు చెబుతుంటే బాధనిపిస్తుంది.. ఏడాదిగా రాష్ట్రం ఎంతో ప్రశాంతంగా ఉంది.. వైసీపీ నేతలకు రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదు.. అందుకే, ఎక్కడ చూసిన అల్లర్లు సృష్టించేందుకే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అరాచక వాదులకు అసలు మాట్లాడే హక్కు లేదు.. సంక్షేమంలో కొత్త పుంతలు తొక్కుతున్నాం.. సర్వ నాశనం అయిపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళుతున్నాం.. ఈ నెలలో అన్నదాత శ్రీకారం చుట్టపోతున్నాం.. వచ్చే నెలలో ఉచిత బస్సు పథకం అమలవుతుంది.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 64 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం.. రికార్డు స్థాయిలో 67 లక్షల మంది పిల్లలకు తల్లికి వందనం అందించామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.
