Minister Kakani Govardhan Reddy: చంద్రబాబు నాయుడుతో పవన్ కల్యాణ్ సమావేశంపై అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు.. ఓవైపు విమర్శలు గుప్పిస్తూనే.. కలిసి వచ్చినా చూసుకుంటామని ప్రకటిస్తున్నారు.. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా.. ఎంత మంది ఏకమైనా.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయే.. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది వైఎస్ జగన్మోహన్‌రెడ్డియే అని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఇక, టీడీపీ, జనసేన చీఫ్‌ల భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు.. పవన్ కల్యాణ్ భేటీని పట్టించు కోవాల్సిన పనిలేదన్నారు.. చంద్రబాబు సభలకు వెళ్లి మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించే సమయం జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు లేదు.. కానీ, ఆ మరణాలకు కారణమైన చంద్రబాబును పరామర్శించేందుకు వెళ్లారు అంటూ ఎద్దేవా చేశారు.
Read Also: CM YS Jagan: పాడి రైతులకు గుడ్‌న్యూస్.. సీఎం చేతుల మీదుగా రూ.7.20 కోట్ల బోనస్
ఇక, కందుకూరు, గుంటూరు ఘటనలకు పోలీస్ వైఫల్యమే కారణం అంటున్నారు.. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు గోదావరి పుష్కరాల సందర్భంగా 29 మంది చనిపోయారు.. అది కూడా ప్రభుత్వ వైఫల్యమని ఒప్పుకుంటారా..? అని సవాల్ విసిరారు మంత్రి కాకాని.. మరోవైపు, చంద్రబాబు కుప్పం పర్యటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంపై స్పందిస్తూ.. కర్ణాటకలో సిద్దేశ్వర స్వామి అంత్యక్రియలకు వచ్చిన ప్రజల ఫోటోలను, వీడియోలను చూపిస్తూ.. కుప్పంలో వచ్చినట్లు మార్ఫింగ్ చేశారని మండిపడ్డారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.
