రైతులకు సంబంధించి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందిలేకుండా చూస్తున్నాం అన్నారు. లక్ష్యం తగ్గించారని ప్రచారం చేస్తున్నారు… పౌర సరఫరాల సంస్థ కోసం నాబార్డ్ తెచ్చిన నిధులను పసుపు..కుంకుమ కింద చంద్రబాబు పంచారు. ఆ బకాయిలను మేము చెల్లించాం.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. కొందరు నేతలకు వ్యవసాయం గురించీ ఏమీ తెలియకపోయినా మాట్లాడుతున్నారు.
Read Also: Minister Vidadala Rajini: అధికారం లేనప్పుడే టీడీపీకి బీసీలపై ప్రేమ
రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తాం. కానీ కొన్ని మీడియాలలో మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వ్యవసాయం గురించి పరిజ్ఞానం ఉన్నవారికి వాస్తవాలు తెలుసు. బహిరంగ మార్కెట్ లో కనీస మద్దతు ధర లేకపోతే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతులను దగా చేశారు. చంద్రబాబు అధికారంలో ఉంటే కరువే.. కొన్ని పత్రికల్లో పొంతన లేని వార్తలు రాస్తున్నారు.
టీడీపీ హయాంలోనే. నెల్లూరు లోని పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నిధుల కుంభకోణం జరిగిందన్నారు మంత్రి కాకాణి. రైతులను అప్పట్లో మోసం చేశారు. ధాన్యం సేకరణలో అవకతవకలకు పాల్పడ్డారు. బోగస్ జి.ఓ.లు ఇచ్జి తప్పుదోవ పట్టించారు. జగన్ హయాంలో ఈ క్రాప్ విధానాన్ని తీసుకు వచ్చాం. నేరుగా రైతుల ఖాతాల్లోకి. నిధులు వేస్తున్నాం. ఆర్.బి.కె.ల ద్వారా ధాన్యం సేకరించి మిల్లర్లకు పంపుతున్నామ అన్నారు మంత్రి కాకాణి. రైతులకు సహకారం ఇస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు చెల్లిస్తున్నాం అన్నారు.
National Wise Pending Cases: దేశంలో ఎన్ని పెండింగ్ కేసులున్నాయో తెలుసా..?
