NTV Telugu Site icon

Minister Jogi Ramesh: సీబీఐ కేసుకు, విశాఖ రాజధానికి ఏంటి సంబంధం?..

Minister Jogi Ramesh

Minister Jogi Ramesh

Minister Jogi Ramesh: రాబోయే రోజుల్లో విశాఖపట్నం రాజధాని కాబోతుంది.. త్వరలో నేను కూడా విశాఖపట్నం షిఫ్ట్ అవుతున్నాను అంటూ దౌత్య వేత్తల సమావేశంలో స్పష్టం చేశారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. అయితే, దీనిపై విపక్షాలు ఫైర్‌ అవుతున్నాయి.. సీబీఐ కేసుతో.. విశాఖ రాజధానికి లింక్‌ పెడుతున్నాయి.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి జోగి రమేష్‌.. సీఎం వైఎస్‌ జగన్ స్టేట్‌మెంట్‌పై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఎక్కడా సీఎం జగన్‌ మాట్లాడలేదన్నారు. ప్రజల ఆలోచన, ఆకాంక్షలకు అనుగుణంగానే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతోందన్న ఆయన.. అసెంబ్లీ సాక్షిగా రాజధానులపై మా ప్రభుత్వ విధానాన్ని వెల్లడించామని తెలిపారు.

Read Also: Undavalli Arun Kumar: రాజధానిపై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు.. స్పందించనంటూనే..!

అమరావతిలోనే శాసన రాజధాని ఉంటుంది.. బీజేపీ కోరినట్లే కర్నూలులో న్యాయ రాజధాని ఉంటుంది అన్నారు మంత్రి జోగి రమేష్‌.. అసలు, సీబీఐ కేసుకు, విశాఖ రాజధాని అంశానికి ఏంటి సంబంధం? అని నిలదీశారు. బోడి గుండుకు, మోకాలికి ముడి పెట్టినట్లు ఉంది టీడీపీ నేతల ధోరణి అంటూ దుయ్యబట్టిన ఆయన.. బురద వేయటమే ప్రతిపక్షాల పని అంటూ కౌంటర్‌ ఇచ్చారు.. ముఖ్యమంత్రి ఇల్లు మా ప్రాంతంలోనే ఉంటుంది అని తెలిపిన ఆయన.. అసలు చంద్రబాబుకు అమరావతిలో అడ్రస్ ఉందా? అని ఎద్దేవా చేశారు.. త్వరలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభం అవుతుంది.. ఈ ప్రాంత నేతలుగా మేం విశాఖ నుంచి పాలన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించారు మంత్రి జోగి రమేష్‌.

Show comments