NTV Telugu Site icon

Minister Gudivada Amarnath: పవర్ స్టార్ కాదు.. ఫ్లవర్ స్టార్.. వాళ్లు జన సైనికులా..? జన సైకోలా..?

Gudivada Amarnath

Gudivada Amarnath

విశాఖ ఎయిర్‌పోర్ట్‌ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అమర్నాథ్.. విశాఖ గర్జనకు మద్దతుగా వచ్చిన మంత్రులు, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలపై దాడి చేశారని మండిపడ్డారు. గర్జన సభకు ఉత్తరాంధ్ర ప్రజల మద్దతు లభించింది.. కానీ, జేఏసీ విశాఖ గర్జనకు పిలుపిచ్చిన రోజునే.. పవన్ ఎందుకు విశాఖ పర్యటన పెట్టుకోవాల్సి వచ్చింది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వారు జన సైనికులా..? జన సైకోలా..? అంటూ తీవ్రంగా స్పందించారు.. జనసైకోలుగానే జనసేన కార్యకర్తలు ప్రవర్తించారన్న ఆయన.. ఈ దాడికి పవన్ కల్యాణ్ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.. ఇది ఉత్తరాంధ్ర ఉద్యమం మీద జరిగిన దాడిగానే మేం భావిస్తున్నాం అన్నారు.. చంద్రబాబుకు అనుకూలంగా రాజకీయ శిఖండిగా మారారు.. ఉదయం జరిగిన ఉద్యమాన్ని పక్క దారి పట్టించేందుకే ఈ దాడి చేశారని ఆరోపించారు..

Read Also: Vishnuvardhan Reddy: ఎవరు దాడి చేసినా తప్పే.. ఎవరి ప్రభుత్వం ఉంది? బాధ్యత ఎవరిది?

విశాఖ గర్జనపై చర్చ జరగ కుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ దాడి జరిగిందని విమర్శించారు మంత్రి అమర్నాథ్.. పవన్ కల్యాణ్ నుంచే జనసేన కార్యకర్తలకు సైకో మెంటాల్టీ వచ్చిందన్న ఆయన.. పవన్ తన పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరాం.. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ప్రయత్నం చేశాం.. కానీ, దానిపై చర్చ జరగకుండా చేసే కుట్ర చేశారని ఆరోపించారు. ఇక, మంత్రులకూ.. వైసీపీ నాయకత్వానికి పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంటును గౌరవించని పవన్.. విశాఖకు ఎందుకొచ్చారు..? అని మండిపడ్డారు. పవర్ స్టార్ కాదు.. ఆయన ఫ్లవర్ స్టార్.. అంటూ పవన్ కల్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాజువాకలో పవన్‌ను ఓడించారని ఉత్తరాంధ్రపై పవన్ కక్ష కట్టారన్న ఆయన.. మా పార్టీ కార్యకర్తలకు సైగ చేస్తే పవన్ తట్టుకోగలరా..? అని ఫైర్‌ అయ్యారు.

Read Also: Flash Flash: విశాఖలో మంత్రుల కార్లపై రాళ్ల దాడి.. ఎయిర్‌పోర్ట్‌ దగ్గర ఉద్రిక్తత..

ఓ పాలసీ, లక్ష్యం లేకుండా వ్యవహరిస్తే.. ఇలాగే ఉంటుంది.. ఎక్కడికెళ్తే అక్కడే రాజధాని అంటున్నారు.. ప్రజల కోసం బతకకున్నా.. మీ కోసమైనా బతకాలిగా అని పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నించారు మంత్రి అమర్నాథ్.. పెళ్లి అనేదే ఓ అడ్జస్ట్‌మెంట్.. ఇంట్లోనే సర్దుకుపోలేని పవన్.. ప్రజలతో ఎలా అడ్జస్ట్ అవుతారని ఎద్దేవా చేశారు.. పవన్‌కు సినీ జీవితాన్నిచ్చింది విశాఖ, పిల్లనిచ్చి పెళ్లి చేసింది విశాఖ.. రాజకీయంగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది విశాఖ… కానీ, పవన్‌ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌.