NTV Telugu Site icon

Dharmana Prasada Rao: కావాలంటే మంత్రి, ఎమ్మెల్యే పదవులు వదిలేస్తా.. కానీ, గోంతెత్తకుండా ఉండను..!

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao: కావాలంటే మంత్రి, ఎమ్మెల్యే పదవులు వదిలేస్తా.. కానీ, మా ప్రాంత ప్రజలకోసం గోంతెత్తకుండా ఉండలేను అని ప్రకటించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం పట్టణంలోని పోట్టి శ్రీరాములు మార్కేట్‌లో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ధర్మాన ప్రసాద్ భూములు దోబ్బేశాడని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు.. రేవిన్యూ మినిష్టర్ గా.. సెంటు భూమి ఇచ్చే అధికారం కూడా నాకు లేదు.. ఇక, రెవెన్యూ మినిస్టర్‌గా భూములు దోబ్బే అవకాశం ఉందా..? అని ప్రశ్నించారు.. కేబినెట్‌లో మాత్రమే ఏవరికైనా భూములు ఇవ్వగలదని స్పష్టం చేసిన ఆయన.. నా రాజకీయ జీవితంలో ఏపని కైనా నయా పైసా ప్రతిఫలం తీసుకున్నట్టు రుజువు చేస్తే.. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ చేశారు..

Read Also: CM KCR : సీఎం కేసీఆర్‌తో సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ భేటీ

ఇక, దమ్ముంటే నా పక్కన చంద్రబాబుని నిజాయితీగా నిలబడమనండి అని మరోసవాల్‌ చేశారు ధర్మాన.. నేను నిరూపిస్తా చంద్రబాబు ఏన్నింటిలో అక్రమాలు చేసాడోనని.. మా ప్రాంతం కోసం మాట్లాడితే.. నేను అవినితి పరుడనని ముద్ర వేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. మంత్రి, ఎమ్మెల్యే పదవులు వదిలేస్తా కావాలంటే.. కానీ, మా ప్రాంత ప్రజలకోసం గోంతెత్తకుండా ఉండబోనని స్పష్టం చేశారు.. అధికార పార్టీలో ఉన్నా.. ప్రజలకోసం అధికారపార్టీనైనా ప్రశ్నిస్తానని ప్రకటించారు. నేను ఓటేయమని అడగను వేస్తేవేస్తారు లేకపోతే లేదు.. కానీ, ఓటేసినందుకు ప్రజలకోసం కష్టపడి పనిచేస్తానన్నారు.

మీలాంటి దోపిడీదారులను కంట్రోల్ చేస్తున్నందుకు సీఎం వైఎస్‌ జగన్‌ పిచ్చోడా..? అని ఫైర్‌ అయ్యారు మంత్రి ధర్మాన.. దోపీడీని కంట్రోల్ చేస్తేనే ప్రజలకు, బీదవారికి పంచవచ్చన్న ఆయన.. చంద్రబాబు ఓకే రాజధాని అని అమరావతిగా ప్రకటిస్తే.. మా రాష్ట్రం అక్కడ ఉండటానికి ఒప్పుకోబోమని స్పష్టం చేశారు.. విశాఖ కేంద్రంగా మాకు రాష్ట్రం కావాలి అని మరోసారి డిమాండ్‌ చేశారు.. పూర్తిగా వేనకపడే ఉన్నాం, జెట్టీలు లేవు, హార్బర్లులేవు, గ్రామాల్లో త్రాగునీరు లేదు.. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా మా పరిస్థితి మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.

Show comments