Minister Dharmana Prasada Rao: కాంట్రాక్టర్లను భయపెడితేనే పనులు జరిగేది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంట్రాక్టర్లను ఏదో రకంగా భయపెట్టకపోతే పనులు జరగవని వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ధర్మాన… మన బడి – నాడు నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని తెలిపారు.. ఇక, రాష్ట్రంలోని ప్రతీ సచివాలయానికి 20 లక్షల రూపాయాలు ఇస్తున్నామని వెల్లడించారు.. ఇంజినీరింగ్ సిబ్బంది బాధ్యతతో పనులు వేగవంతంగా చేయాలని.. ఎస్టిమేషన్ వేసి తొందరగా పనులు జరిపించాలని ఆదేశించారు.. అయితే, కాంట్రాక్టర్లను ఏదో రకంగా భయపెట్టకపోతే పనులు జరగవని చెప్పుకొచ్చారు మంత్రి.. అవసరం అయితే కొద్ది మంది కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో కూడా పెట్టాలని తెలిపారు.. ఇక, గతంలో మాదిరీ పెద్ద ఎత్తున లాభాలు రావాలంటే కుదరని కాంట్రాక్టర్లకు సూచించారు. హౌసింగ్ స్కీమ్ విషయంలో మరింత ముందుకువెళ్లాలన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
Read Also: Presidential Election Result: ముగిసిన ఎంపీ ఓట్ల లెక్కింపు.. ద్రౌపది ముర్ముకు 540 ఎంపీల ఓట్లు
Also Read
కాగా, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చేసింది. పాఠశాలలను కొత్తగా మార్చేసి కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా 2019 నవంబర్ 14న నాడు-నేడు పథకానికి శ్రీకారం చుట్టింది సర్కార్.. మన బడి నాడు నేడు స్కీమ్ కింద ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పిస్తున్నారు.. టాయిలెట్ల నిర్మాణం, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లతో విద్యుద్దీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బంది కోసం ఫర్నిచర్, పాఠశాలకు పెయింటింగ్, స్కూళ్లకు పెద్ద, చిన్న మరమ్మతులు, బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్స్, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కాంపౌండ్ గోడలు.. ఇలా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ముందుకుసాగుతున్నారు..
తాజావార్తలు
-
West Bengal Cabinet Expansion 2026: పశ్చిమ బెంగాల్ లో మంత్రివర్గ విస్తరణ.. నబన్నాలో 35 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
-
Hyderabad Online Betting: భారీ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. 13 మంది అరెస్ట్.! వేల కోట్ల లావాదేవీలపై CID దర్యాప్తు..
-
IRUMUDI : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
-
IPL 2026 Champions: RCB విజయం.. క్రీడాస్ఫూర్తిని చాటుతూ ప్రత్యర్థి జట్ల నుండి అభినందనలు.! ‘క్లబ్‌లోకి స్వాగతం’ అంటూ..
-
Vaibhav Sooryavanshi: చెప్పట్లేదు కానీ చాలా ఒత్తిడి ఉంది.. వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!