కాంట్రాక్టర్లను ఏదో రకంగా భయపెట్టకపోతే పనులు జరగవని వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ధర్మాన… మన బడి – నాడు నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని తెలిపారు.. ఇక, రాష్ట్రంలోని ప్రతీ సచివాలయానికి 20 లక్షల రూపాయాలు ఇస్తున్నామని వెల్లడించారు.. ఇంజినీరింగ్ సిబ్బంది బాధ్యతతో పనులు వేగవంతంగా చేయాలని.. ఎస్టిమేషన్ వేసి తొందరగా పనులు జరిపించాలని ఆదేశించారు.. అయితే, కాంట్రాక్టర్లను ఏదో రకంగా భయపెట్టకపోతే పనులు జరగవని చెప్పుకొచ్చారు మంత్రి.. అవసరం అయితే కొద్ది మంది కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో కూడా పెట్టాలని తెలిపారు.. ఇక, గతంలో మాదిరీ పెద్ద ఎత్తున లాభాలు రావాలంటే కుదరని కాంట్రాక్టర్లకు సూచించారు. హౌసింగ్ స్కీమ్ విషయంలో మరింత ముందుకువెళ్లాలన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
Read Also: Presidential Election Result: ముగిసిన ఎంపీ ఓట్ల లెక్కింపు.. ద్రౌపది ముర్ముకు 540 ఎంపీల ఓట్లు
కాగా, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చేసింది. పాఠశాలలను కొత్తగా మార్చేసి కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా 2019 నవంబర్ 14న నాడు-నేడు పథకానికి శ్రీకారం చుట్టింది సర్కార్.. మన బడి నాడు నేడు స్కీమ్ కింద ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పిస్తున్నారు.. టాయిలెట్ల నిర్మాణం, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లతో విద్యుద్దీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బంది కోసం ఫర్నిచర్, పాఠశాలకు పెయింటింగ్, స్కూళ్లకు పెద్ద, చిన్న మరమ్మతులు, బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్స్, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కాంపౌండ్ గోడలు.. ఇలా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ముందుకుసాగుతున్నారు..