Dadisetti Raja: యనమలకు దాడిశెట్టి సవాల్.. తమ్ముడితో ఆ పని చేయించగలవా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Dadisetti Raja Challenges Yanamala Ramakrishnudu: మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుపై మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యనమల అనే వాడు పతివ్రత అవతారం ఎత్తాడని.. తాను పతివ్రతని అని చెప్పుకుంటూ, తన తమ్ముడు కృష్ణుడు ఎదవన్నర ఎదవ అని చెప్పుకుంటున్నాడంటూ విరుచుకుపడ్డారు. గత 40 ఏళ్లగా యనమల డైరెక్షన్‌లో కృష్ణుడు తుని నియోజకవర్గంలో ప్రజలను పీడించుకుతిన్నాడని ఆరోపించారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనపై ఏ కేసు పెట్టాలని కృష్ణుడు అడిగితే.. అట్రాసిటీ కేసు పెట్టమని రామకృష్ణుడు చెప్పాడన్నారు.
New Judges: సుప్రీంకోర్టులో కొత్తగా ఐదుగురు జడ్జీలు.. నోటిఫికేషన్ జారీ
Also Read
- AP Government: వారసత్వ భూములపై గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- CM Chandrababu: అమరావతి అంటే 29 గ్రామాలే కాదు.. విజయవాడ-గుంటూరుతో కలిసి అభివృద్ధి..
- Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హత్య కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ నాగరాజు
- Real Estate Scam: శ్రీవారి వీవీఐపీ దర్శనం పేరుతో రియల్ ఎస్టేట్ మోసం?..
తునిలో ఎంతోమంది విలువైన ప్రాణాలను తీసేసి, వారి ఆస్తుల్ని కృష్ణుడు కాజేశాడని ఆరోపణలు చేశారు. యనమలకు దమ్ముంటే.. తమ్ముడు ద్వారా తుని ప్రజల నుంచి దోచేసిన సొమ్ములను తిరిగిచ్చేసి, అప్పుడు పతివ్రతను అని చెప్పమనండి అంటూ సవాల్ విసిరారు. ఇదే సమయంలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై పరోక్షంగా కౌంటర్లు వేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు కొత్త నాటకానికి తెర లేపారని, తప్పులన్ని వాళ్ళు చేసి జగనన్నపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు పార్టీ విడిచి వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలు, వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవరని తాను ఛాలెంజ్ చేస్తున్నానన్నారు. ఇంతకుముందు జగన్‌ను కష్టాల్లో వదిలి 23 మంది వెళ్లిపోయారని, ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలకు రాజకీయ భవిష్యత్ లేకుండా పోయిందని దుయ్యబట్టారు.
Pathaan: బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్… దంగల్ రికార్డులు కూడా బ్రేక్
అంతకుముందు కూడా.. యనమలపై దాడిశెట్టి రాజా మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా యనమల రామకృష్ణుడు కేవలం రెండు నియోజకవర్గాల కోసం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంలో తన వెనుక తిరిగిన వెంకటేష్ రూ.4 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని.. అప్పుడు చేయని తప్పుని తన మీద వేసుకొని మొత్తాన్ని భరించానని.. ఇప్పుడు యనమల అలాగే తన తమ్ముడి తప్పుని ఒప్పుకోగలరా? అని ప్రశ్నించారు. తనకు సంబంధం లేకున్నా.. టీడీపీ నాయకులు గతంలో రైలు దహనం కేసులో తనని అన్యాయంగా ఇరికించారని, అనేక కేసులుపెట్టి ఎంతగానో వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.
AP High Court: పోలీసులకు హైకోర్టు షాక్.. డిబేట్ ఎలా జరుగుతుందని నిలదీత
తాజావార్తలు
-
Sharwanand: ‘భోగి’ రఫ్ కట్కు శర్వానంద్ ఫుల్ సాటిస్ఫై.. సంపత్ నందికి మరో సినిమా గ్రీన్ సిగ్నల్
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్‌కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!