Site icon NTV Telugu

Minister Buggana Rajendranath Reddy: అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది

Buggana 1

Buggana 1

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అమరావతి విషయంలో టీడీపీ-వైసీపీ నేతల మధ్య మాటలయుద్ధం సాగుతోంది. రాజధానికి సంబంధించి శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను చంద్రబాబు పూర్తిగా పక్కపెట్టేశారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్నారు. అక్కడ టీడీపీ నేతలు భూములు కొన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కొందరి చేతుల్లోనే అమరావతి భూములు ఉన్నాయని బుగ్గన అన్నారు. పరిటాల, పయ్యావుల, ధూళిపాళ్ల, హెరిటేజ్ ఫుడ్స్.. సహా చాలా మంది టీడీపీ నేతలు భూములు సేకరించారని తెలిపారు. రాజధాని ప్రకటనకు ముందే ఇదంతా జరిగిందన్నారు.

Read Also: Jammu Kashmir: కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం… ఆరుగురి దుర్మరణం

హెరిటేజ్‌ ఫుడ్స్‌ కూడా 14 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. అమరావతిలో కొందరు మాత్రమే భూములు ఎలా కొన్నారని బుగ్గన ప్రశ్నించారు. రాజధాని ప్రకటన ఎప్పుడు జరిగిందని బుగ్గన టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ని ప్రశ్నించారు. అమరావతిలోవి తాత్కాలిక నిర్మాణాలు.. వేల ఎకరాల భూములు కొంతమంది చేతుల్లోనే ఉన్నాయన్నారు. టీడీపీ అంటేనే టెంపరరీ డెవలప్‌మెంట్‌ పార్టీ అని, అమరావతిలో టీడీపీ నేతలు భూములు కొన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. దళితులను భయపెట్టి అసైన్డ్‌ భూములను లాక్కున్నారని మండిపడ్డారు.

కొందరి ఆస్తి విలువ పేంచేందుకు రాష్ట్ర మొత్తం పన్ను కట్టాలా? అని నిలదీశారు. అమరావతిలోఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని మంత్రి బుగ్గన అన్నారు. బిల్డింగులు కడితే పరిపాలన సాగుతుందా అని ప్రశ్నించారు. రాజధాని ప్రకటనకు ముందే అమరావతిలో భూముల కొనుగోలు జరిగిందన్నారు. రియల్‌ ఎస్టేట్‌ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. పాదయాత్రలో స్థానికులు లేరని, రియల్‌ ఎస్టేట్‌ బ్యాచ్‌ చేస్తున్న పాదయాత్ర ఇదని ధ్వజమెత్తారు.

అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలనేదే సీఎం జగన్‌ ఆకాంక్ష అని తెలిపారు.అమరావతి ప్రాంతంలో రాజధాని వస్తుందనే భావనతోనే కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములు కొనుగోలు చేశారన్నారు మంత్రి బుగ్గన. కొంతమంది వ్యక్తులు మాత్రమే భూములు కొనడం ఏంటి? అమరావతి విషయంలో జరిగింది అందరికీ తెలుసన్నారు ఆర్థికమంత్రి బుగ్గన. తొలుత రాజధాని నాగార్జున వర్శిటీ అన్నారు.. తర్వాత నూజివీడు అన్నారు..అక్కడ జనం భూములు కొనుక్కుంటే.. ఈ టైంలో అమరావతిలో భూములు కొనుక్కున్నారు. రాజధాని ప్రాంతంలో భూములు ఎవరు కొనుగోలు చేశారో వివరించిన బుగ్గన. పెదకాకాని, కంతేరు, తాడికొండ.. లలో హెరిటేజ్ ఫుడ్స్, పయ్యావుల హారిక కొనుగోలు చేసిన భూములు వివరించారు మంత్రి బుగ్గన.

Read Also: Kodali Nani Speech in Assembly On 3 Capitals : అసెంబ్లీలో కొడాలి నాని పవర్ ఫుల్ స్పీచ్

Exit mobile version