NTV Telugu Site icon

Botsa Satyanarayana: పవన్ వ్యాఖ్యలకు మంత్రి బొత్స స్ట్రాంగ్ కౌంటర్

Botsa On Pk

Botsa On Pk

Minister Botsa Satyanarayana Strong Counter To Pawan Kalyan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అందరూ రౌడీలు, గూండాలే ఉన్నారని జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జనసేన పార్టీనే దొంగల, రౌడీల పార్టీ అంటూ తూర్పారపట్టారు. వైసీపీ పార్టీలో ఉన్న తాను కూడా రౌడీనా? గూండానా? అంటూ మంత్రి బొత్స ప్రశ్నించారు. తన చరిత్రలో ఒక్క కేసు కూడా లేదని, ఇంకా చెప్పుకుంటే పవన్ కళ్యాణ్‌పై ఏదో ఒక కేసు నమోదై ఉండొచ్చని అన్నారు. అసలు జనసేన పార్టీలో చెప్పుకోదగ్గ ఒక్క నాయకుడైనా ఉన్నాడా? అలాంటప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకని నిలదీశారు. పవన్ కళ్యాణ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే.. ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఆయనకు ఒక విధానం, ఆలోచన లేదని విమర్శించారు.

Swamyji Sampoornananda: విశాఖలో బయటపడ్డ కీచక స్వామీజీ లీలలు.. బాలికపై లైంగిక దాడి

ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కూడా మంత్రి బొత్స విరుచుకుపడ్డారు. ఎవరికో పుట్టిన బిడ్డను తనకు పుట్టిన బిడ్డగా జగన్ చెప్పుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారని.. అసలు చంద్రబాబుకి ఇంగితజ్ఞానం ఉందా? ఆ వయసుకు ఆయన మాట్లాడాల్సిన మాటలేనా అవి? అని నిలదీశారు. అలాంటి మాటలు మాట్లాడటం, మళ్లీ ఎవరైనా ఏమైనా అంటే ఏడ్వడం అంటూ మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. టిడ్కో ఇల్లు తానే కట్టుకున్నానని చంద్రబాబు చెప్పుకుంటున్నారని, మరీ సీఎంగా ఉన్నప్పుడు ఎందుకని ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, ఇందుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన 40 ఏళ్ల ఇండస్ట్రీ ఏమయ్యింది? అని అడిగారు. వైసీపీ మాత్రమే బీసీల పార్టీ అని, తమ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వంమని అన్నారు. 2024 ఎన్నకల్లో తాము ఒంటరిగానే పోటీకి దిగుతామని మంత్రి పేర్కొన్నారు.

Ambati Rambabu: పవన్ కళ్యాణ్‌పై అంబటి సంచలన ఆరోపణలు.. రష్యాలో ఫైల్ ఓపెన్