Minister AppalaRaju: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీపై మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్ర విమర్శలు చేశారు. శ్రీకాకుళంలో జరిగే సభ స్క్రిప్ట్ కోసం చంద్రబాబును పవన్ కలిశాడని ఆయన ఆరోపించారు. బీజేపీతో పొత్తులో ఉండి తన రేటు పెంచుకోవడానికే చంద్రబాబును పవన్ కలిశాడని మంత్రి అప్పలరాజు ఆరోపించారు. పవన్ తనను నమ్మిన వారిని ముంచేస్తున్నాడని.. ఆయనకు డబ్బు పిచ్చి పట్టుకుందని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కలయికలో ఆశ్చర్యం ఏం లేదన్నారు. సింగిల్‌గా పోటీ చేసే దమ్ము టీడీపీ, జనసేన పార్టీలకు ఉందా అని మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. ఏ ఉద్దేశంతో చంద్రబాబును కలిశారో పవన్ చెప్పాలన్నారు. పవన్ మాట్లాడే ప్రతి మాటకు ఒక రేటు ఉంటుందని కౌంటర్ ఇచ్చారు. నీచమైన రాజకీయాలకు పవన్ అలవాటు పడ్డాడని మండిపడ్డారు.
Read Also: WTC Final: ఆస్ట్రేలియాకు ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు.. రెండో స్థానం ఎవరిది?
మరోవైపు కాకినాడలో మంత్రి దాడిశెట్టి రాజా కూడా ఈ అంశంపై స్పందించారు. చంద్రబాబు, పవన్ భేటీని రాష్ట్ర ప్రజలు పట్టించుకోరని.. పవన్ ఒక ప్యాకేజీ స్టార్ అని ఆరోపించారు. బీజేపీతో పొత్తులో ఉండి చంద్రబాబు చుట్టూ ఎందుకు తిరుగుతున్నావని పవన్‌ను ప్రశ్నించారు. పవన్, చంద్రబాబు కలయిక స్వార్ధ ప్రయోజనాల కోసమే అని విమర్శించారు. పవన్ ఒంటరిగా మిగిలిపోవడం ఖాయమన్నారు. 11 మంది చనిపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు చంద్రబాబును ప్రశ్నించలేదని నిలదీశారు. అటు వైసీపీ ఎంపీ వంగా గీత కూడా చంద్రబాబు-పవన్ భేటీపై స్పందించారు. రాజ్యాంగంలో ఎవరు ఎవరినైనా కలవచ్చని.. కానీ స్వార్థ ప్రయోజనాల కోసం కలవడం తప్పు అని ఆమె అన్నారు. ఎవరు కలిసినా తమ పార్టీకి నష్టమేమీ లేదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ వల్ల ఏపీకి ఒరిగేదేమీ లేదని ఎంపీ వంగా గీత అన్నారు.
