Ambati Rambabu: గోదావరికి మళ్లీ వరద వచ్చే పరిస్థితి.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: గోదావరికి మళ్ళీ వరద వచ్చే పరిస్థితి ఉందని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరికలు జారీ చేశారు. పోలవరం, ధవళేశ్వరం దగ్గర పది లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉందన్నారు. దీంతో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కృష్ణా నదికి కూడా వరద తాకిడి ఉండే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండిందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి నీటి బొట్టు దిగువ ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
2018 లో పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పి చంద్రబాబు కాళ్లు, చేతులు పైకి ఎత్తేశాడని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. లోయర్ కాఫర్ డ్యాంను చంద్రబాబు అనుకున్న సమయానికి ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. లోయర్, అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టే ప్రయత్నం చేశారని నిలదీశారు. నవయుగ కన్స్ట్రక్షన్స్ అధినేత ఈనాడు రామోజీరావు వియ్యంకుడు అని.. నవయుగను తప్పించి పోలవరం పనులను మేఘా కంపెనీకి ఇచ్చామని కడుపుమంటతో ఈనాడు పత్రిక తప్పుడు కథనాలు రాస్తోందని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గత ప్రభుత్వంలో దోచుకుందాం.. దాచుకుందాం అనుకున్నారని.. ట్రాన్స్ట్రాయ్ను తీసేసి చంద్రబాబు నవయుగ కంపెనీకి నామినేషన్ పద్ధతిలో ఇచ్చింది వాస్తవం కాదా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. తాము రివర్స్ టెండర్ ద్వారా మరింత తక్కువకు మేఘాకు ఇచ్చామన్నారు.
Also Read
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
- NTR Bharosa Pension: వారికి గుడ్ న్యూస్.. పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..
ఇసుక నుంచి ఏడాదికి 750 కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని.. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ వందల కోట్లు దోచుకుందని మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. వనజాక్షి లాంటి అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఏం జరిగిందో ప్రజలు అందరూ చూశారని.. ట్రాన్స్ ట్రాయ్‌ను తప్పించి నామినేషన్ లో నవయుగకు ఇవ్వటం స్కాం కాదా అని ప్రశ్నించారు. పోలవరం విషయంలో టీడీపీ చేసిన పాపాలు సరిచేయలేక తాము నానాపాట్లు పడాల్సి వస్తోందన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా తెలియక కొన్ని వ్యాఖ్యలు చేశారన్నారు. ఓబుళాపురం మైనింగ్‌పై టీడీపీ మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని.. అక్కడ చాలా కాలం నుంచి వివాదం ఉందని.. ఎవరైనా సుప్రీం కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉండాలని మంత్రి అంబటి రాంబాబు సూచించారు.
గోరంట్ల మాధవ్ ఎపిసోడ్లో టీడీపీ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. మాధవ్ గురించి, మాధవ్ రెడ్డి గురించి ఇప్పుడు మాట్లాడటం ఎందుకు అని.. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా స్పందిస్తానని వ్యాఖ్యానించారు. మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయని.. ప్రపంచంలో ఇవే ముఖ్యమైన విషయాలా అని ప్రశ్నించారు. ప్రధాని పలుకరించగానే చంద్రబాబు పులకరించి పోతున్నాడని.. ఎవరైనా పలకరిస్తే తప్పించి సొంతంగా స్థాయి లేదని అర్థం అయినట్లు ఉందని చురకలు అంటించారు. బొకే తోసేసిన వాళ్ళ గురించి కూడా మాట్లాడితే బాగుండేదన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పలకరిస్తాడని చంద్రబాబు తపించిపోతున్నాడని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!