AP Three Capitals: మూడు రాజధానులపై ఎలాంటి సందేహం అవసరం లేదు.. వైసీపీ విధానం మూడు రాజధానులే అన్నారు మంత్రి అంబటి రాంబాబు.. విజయవాడలో భూగర్భ జలవనరుల డేటా సెంటర్‌ను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమతౌల్యత కోసమే మూడు రాజధానులు.. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అనే స్ధానిక భావాలున్నాయని.. వాటిని వదులుకోకూడదనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.. నీటి పరీక్షలకు ఇకపై విజయవాడలో పూర్తి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు..
మరోవైపు.. పవన్ కళ్యాణ్ చాలా పచ్చబొట్లు వేసుకోవాలి.. వారాహి ఏది.. ఎక్కడ..? ఆ సినిమా ఆపారా? అంటూ ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు.. అవగాహన ఉండి రాజకీయ విమర్శలు చేయాలి.. మమ్మల్నే ప్రజలు ఆశీర్వదిస్తారనే విశ్వాసం పవన్ కే ఉందంటూ వ్యాఖ్యానించారు.. ఇక, లోకేష్, పవన్ లకు నిబద్ధత లేదని మండిపడ్డారు.. లోకేష్ తెలుగు వాడుక భాష మాట్లాడలేడు.. ప్రశాంతత బదులు ప్రశాంతత్త అన్నాడు అని సెటైర్లు వేశారు.. తెలుగు మాట్లాడలేని వాడు టీడీపీ వారసుడా..? ఇదేనా రాష్ట్రానికి చంద్రబాబు చెప్పిన ఖర్మ అని ఎద్దేవా చేశారు.. లోకేష్ పాదయాత్రతో టీడీపీ మరింత పతనం అవుతుందని జోస్యం చెప్పారు.. అచ్చెన్నాయుడు లాంటి వాళ్లు ఎందుకు లోకేష్ పాదయాత్ర పెట్టామా? అని తలలు పట్టుకుంటున్నారన్నారు. ఇక, 40 లక్షల ఎకరాలు రాష్ట్రంలో భూగర్భజలాల మీద ఆధారపడి ఉన్నాయి.. ఏ పంటలకు అనుకూలంగా ఉండే జలాలు ఉన్నాయో విజయవాడలో ఏర్పాటు చేసిన భూగర్భ జనవనరుల డేటా సెంటర్‌లోని ల్యాబ్ నిర్ణయిస్తుందన్నారు.. రాష్ట్రంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయని.. ఏలూరు, విజయవాడ, చిత్తూరు, విశాఖలలోనే డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామని.. రూ. 16.5 కోట్లతో విశాఖలో డేటా సెంటర్ ఉంటుందన్నారు మంత్రి అంబటి రాంబాబు.