ఇప్పటం వ్యవహారంలో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. కోర్టును ఆశ్రయించిన 14 మందికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించిన విషయం విదితమే.. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. విపక్షాలపై ఫైర్ అయ్యారు.. ఇప్పటంలో అనవసర రాద్దాంతం చేశారు.. ప్రభుత్వాన్నే కూల్చాలని లోకేష్ విమర్శలు చేశారు.. చివరికి ఏమైంది? కోర్టునే మోసం చేసినట్టు తేలిందని ఫైర్ అయ్యారు.. పిటిషనర్లకు లక్ష చొప్పున పెనాల్టీ వేసింది అని గుర్తుచేశారు.. కుట్రలు చేసి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనుకుంటే ఏమవుతుందో ఇప్పటం కథలో తేలిపోయిందన్నారు మంత్రి అంబటి.
Read Also: MP VIjaya Sai Reddy: లోకేష్‌పై సెటైర్లు.. అక్కడ ఫోన్‌ను తలకిందులు చేయాల్సిన అవసరం ఏంటి?
మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా చిట్ ఫండ్ కంపెనీల మీద సోదాలు జరుగుతున్నాయని తెలిపారు మంత్రి అంబటి.. తప్పుడు పనులు చేసిన వారిపై చట్టపరమైన కేసులు పెడుతున్నారు.. ఇందులో మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ కూడా అక్రమాలు చేసినట్టు అధికారులు గుర్తించారని వెల్లడించారు.. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉంది.. ప్రభుత్వం స్పెషల్ పిటిషన్ వేసిందని.. రాష్ట్రంలో ఎవరైనా చట్టబద్దంగా వ్యాపారాలు చేస్తే సరే.. అలా కాకుండా చట్టవ్యతిరేకంగా చేస్తామంటే కుదరదు.. చిట్ ఫండ్ చట్టం ఏం చెప్తుందో అలాగే వ్యవహరించాలి.. మొన్నటి సోదాల్లో మార్గదర్శిలో భారీగా అక్రమాలు జరిగాయని తేలింది.. ఒక్కో చిట్ కి ఒక్కో ఖాతాని ఓపెన్ చేయాలి.. కానీ, మార్గదర్శి అన్ని చిట్ లకు కలిపి ఒకే ఖాతా నిర్వహిస్తోందని విమర్శించారు. ష్యూరిటీ పేరుతో డబ్బులు ఇవ్వకుండా వారి దగ్గరే ఉంచుకుంటున్నారని ఆరోపించారు మంత్రి అంబటి రాంబాబు.. ఇలా పెద్ద ఎత్తున రిజర్వ్‌ఫండ్ ని రెడీ చేసుకుంటున్నారు.. ఆ ఫండ్‌ను ఇతర అవసరాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించిన ఆయన.. ఇలా చేయటం చట్ట వ్యతిరేకం.. దీనిని ప్రశ్నిస్తే కక్షసాధింపు అంటూ గోల చేస్తున్నారని మండిపడ్డారు.. ఎవరైనాసరే చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేశారు అంబటి రాంబాబు.
