మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై ఫైర్ అయ్యారు మంత్రి అంబటి రాంబాబు.. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీరాముని ఆలయంలో ఇవాళ పట్టువస్త్రాలు సమర్పించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రా భద్రాద్రిగా ఒంటిమిట్ట ప్రత్యేకతను సంతరించుకుందన్న ఆయన.. శ్రీరామ నవమి రోజున కుటుంబ సమేతంగా కోదండ రాముణ్ణి దర్శించు కోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.. భద్రాద్రి కన్నా ఎంతో విశిష్టమైన ఆలయం ఒంటిమిట్టగా అభివర్ణించారు.. ఇక, చంద్రబాబు, పవన్‌పై విరుచుకుపడ్డారు అంబటి.. చంద్రబాబు ఒక మ్యానుపులేటర్ .. వ్యవస్థల్ని మేనేజ్ చేసి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడన్న ఆయన.. రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేస్తానని చెప్పడం.. పోలవరాన్ని నాశనం చేసినట్లే చేస్తారు అంటూ ఫైర్ అయ్యారు.
Read Also: Bhadrachalam Ramayya Kalyanam Live: భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణం
చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఆయన ఆస్తులను, కొడుకును పునర్ నిర్మిస్తాడు తప్ప ప్రజలకు ఏమీ ఒరగదంతూ సెటైర్లు వేశారు అంబటి రాంబాబు.. పోలవరం విషయంలో జరిగిన తప్పిదాలన్నిటికీ గత ప్రభుత్వం భాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.. టీడీపీ తప్పిదాల వల్లే పోలవరం నిర్మాణంలో సమస్యలువచ్చాయి.. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో అనేక తప్పిదాలు జరిగాలు.. ఇప్పుడు దాని అంచనా వ్యయం పెరిగింది.. 2017-18 నాటి అంచనాలే 50 వేలకు దాటి ఉన్నాయన్నారు. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చంద్రబాబు కోసమే పుట్టాడంటూ ఎద్దేవా చేశారు.. చంద్రబాబు కోసం పుట్టాడు.. పనిచేస్తున్నాడు.. చేస్తాడు.. కానీ, ఆయన్ను దేవుడే రక్షించాలన్నారు.. ఓటు చీలకుండా చేస్తాం అని పవన్ చెప్పడం ఇప్పుడు కొత్త కాదన్నారు. రాష్ట్రంలోని మొన్నటి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటు కి ఓటు లాంటిది జరిగింది.. నిరూపించ లేక పోవచ్చు.. కానీ, టీడీపీ ఆ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందంటూ ఆరోపించారు మంత్రి అంబటి రాంబాబు.