ఏడ్చే మగాడిని.. నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు అని పెద్దలు చెబుతుంటారు.. అంటే, ఏడుపు అనేది మగవాని స్వభావానికి విరుద్ధం.. అదే విధంగా నవ్వు అనేది సామాన్య స్త్రీ స్వభావానికి విరుద్ధమట.. అందుకే ఈ సామెత వచ్చిందంటారు.. అయితే, ఈ సామెతను చెబుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేస్తూ హాట్ కామెంట్లు చేశారు మంత్రి అంబటి రాంబాబు.. ఏడ్చే మగాడిని నమ్మకపోవడం మన సంస్కృతి.. ఆంధ్ర ప్రజలు ఏడ్చే మగవాడిని నమ్మొద్దు అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలకోసం కష్టపడే వారిని ఆదరించండి అంటూ పిలుపునిచ్చారు.. మరోవైపు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 50వ పుట్టినరోజు సందర్భంగా రెండు రోజుల పాటు సాంస్కృతిక సంబరాలు జరుగనున్నాయని తెలిపారు. నేటి సమాజంలో సంస్కృతి, సంప్రదాయాలు మర్చిపోతున్నారు.. పాత సంస్కృతి అంతరించిపోయి, పాశ్చాత్య సంస్కృతి వచ్చింది.. సందర్భానికి అనుగుణంగా మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని.. అందుకే ఈ సంబరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.. మన సంస్కృతిపై ప్రేమాభిమానాలు ఉన్నవారంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు..
Read Also: Samsung Black Friday Sale: భారీ ఆఫర్లు తెచ్చిన శాంసంగ్..
ఇక, రాష్ట్ర పరిపాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి మంత్రి ఆర్కే రోజా అండగా ఉంటున్నారని వ్యాఖ్యానించారు మంత్రి అంబటి రాంబాబు.. కాగా, ఆ మధ్య ఏపీ రాజకీయాల్లో పరిణామాలన్నీ హాట్‌టాపిక్‌గా మారిపోయాయి.. టీడీపీ అధినేత చంద్రబాబు కంటతడి పెట్టుకున్న ఘటన చర్చగా మారింది.. తన భార్య భువనేశ్వరిపై, తన కుటుంబ సభ్యులపై వైసీపీ ప్రజాప్రతినిధుల అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు నాయుడు కన్నీటి పర్యంతం కావడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఘటనను ఉద్దేశిస్తూ.. మరోసారి చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు.
