AP Heavy Rains: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు (బుధవారం) ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల అతిభారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ వాయుగుండం రేపు (గురువారం) తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే ఛాన్స్ ఉంది. దీని ప్రభావంతో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనింది. దక్షిణకోస్తా, రాయలసీమలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పుకొచ్చింది.
Read Also: Citadel Honey Bunny: 11 నిమిషాల సీన్ సింగిల్ టేక్‌లో చేశాం: వరుణ్
కాగా, ఏపీలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, ప్రకాశం జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రెండు రోజుల పాటు విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. అయితే, ప్రకాశం జిల్లాలోని ఏడు మండలాల్లో ఇవాళ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అర్ధవీడు, దోర్నాల, కంభం, పెద్దరావీడు, మార్కాపురం, రాచర్ల, ముండ్లమూరు మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇక, ఒక్క రోజులోనే 20 సెంటీ మీటర్ల వర్షం కురవవచ్చని అంచనా వేసింది. ప్రత్యేక బృందాలతో సిద్ధంగా ఉన్న అధికార యంత్రాంగం.. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు ఇప్పటి వరకు 125 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.
Read Also: Ponguleti Srinivasa Reddy: అధికారులు దొరల పాలనలో ఉన్నామనేది మర్చిపోండి.. ప్రజా పాలనలో ఉన్నాం
అయితే, రేపు (గురువారం) కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెదర్ డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి -60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.. కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు.