Mekathoti Sucharitha: సుచరిత వ్యాఖ్యల వెనుక అసలు మర్మం ఇదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. రాజకీయంగా మా మనుగడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే అని స్పష్టం చేస్తూనే.. నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చానంటే నా భర్త దయాసాగర్ కూడా దానికి కట్టుబడే ఉంటారన్నారు.. అయితే, అలా కాకుండా నా భర్త దయాసాగర్ పార్టీ మారతాను నువ్వు నాతో రా అంటే.. ఎంత రాజకీయ నాయకురాలినైనా భర్తతో పాటు వెళ్లాల్సిందేగా? అందుకే.. నా భర్త పార్టీ మారితే నేనూ వెళ్తానని చెప్పుకొచ్చారు.. ఇక, నా భర్త ఒక పార్టీలో.. నేను మరొక పార్టీలో.. మా పిల్లలు ఇంకో పార్టీలో ఉండరని స్పష్టం చేశారు.. రాజకీయాల్లో మనగలిగినన్నాళ్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే ఉండాలనుకున్నామని గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు మాజీ హోంమంత్రి మేకతేటి సుచరిత. అయితే, ఉన్నట్టుండి సుచరిత ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? అనే చర్చ వైసీపీలో ఆసక్తికరంగా మారిపోయింది.
Read Also: Mekathoti Sucharitha: మేకతోటి సుచరిత ఆసక్తికర వ్యాఖ్యలు.. నా భర్త పార్టీ మారితే నేనూ వెళ్తా..
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి కేబినెట్లో మేకతోటి సుచరిత హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.. కానీ, వైఎస్ జగన్ రెండో కేబినెట్లో మాత్రం ఆమెకు చోటు దక్కలేదు.. దీనిపై బహిరంగంగానే ఆమె పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి.. సుచరితను మంత్రివర్గంలో కొనసాగించాలంటూ ఆమె అనుచరులు ఆందోళనలు కూడా చేశారు.. ఏకంగా ఎమ్మెల్యే పదవికి కూడా ఆమె రాజీనామా చేశారనే వార్తలు హల్చల్ చేశాయి.. ఇక, ఆమెకు గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ బాధ్యతలు ఇచ్చినా.. అనారోగ్య సమస్యలున్నాయి.. నేను ఆ పదవిని నిర్వహించలేనంటూ ఆమె తిరస్కరించారు.. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారిగా ఉన్న సుచరిత భర్త దయాసాగర్.. ఈ మధ్యే రిటైర్మెంట్ తీసుకున్నారు. కాకుమానులో జరిగిన వైసీపీ సమావేశంలో.. దయాసాగర్, సుచరిత ఇదరూ పాల్గొన్నారు.. ఆయన సమక్షంలోనే.. రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారామె.. దీంతో, సుచరిత వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి? దయాసాగర్.. మరోపార్టీలో సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారా? అక్కడ సీటు పక్కా అయితే.. వైసీపీకి గుడ్‌బై చెప్పేస్తారా? రిటైర్మంట్ చేసుకున్న దయాసాగర్.. పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? ఆయన అడుగుజాడల్లోనే ఆమె కూడా పార్టీ మారతారా? ఇలా అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!